Site icon NTV Telugu

Wrestlers protest: నాపై ఒక్క లైంగిక ఆరోపణ రుజువైనా నేను ఉరేసుకుంటా.. బ్రిజ్ భూషన్ సంచలన వ్యాఖ్యలు

Brij Sharan

Brij Sharan

Brij Bhushan: డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నారు. అతడిని అరెస్ట్ చేయాలంటూ ఏప్రిల్ 23 నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు నిరసన చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం రెజ్లర్లకు మద్దతుగా రైతులు ఈ రోజు ఢిల్లీలో నిరసనలకు పిలుపునిచ్చారు. హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున ఢిల్లీకి ఆందోళకారులు చేరుకునే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున ఢిల్లీ పోలీసులు మోహరించారు.

Read Also: Imran Khan: పాకిస్తాన్ పరువు పోతోంది.. బిలావల్ భుట్టో భారత్ వెళ్లి ఏం సాధించాడు..?

ఇదిలా ఉంటే ఈ మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషన్ సింగ్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. నాపై ఒక్క లైంగిక ఆరోపణ రుజువైనా నేను ఉరేసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. అన్ని విషయాలను ఓపెన్ గా చెప్పలేనని, దీనిపై ఢిల్లీ పోలీసులు విచారణ చేస్తున్నారని, ఈ ఆరోపణల్ని ధృవీకరించే సాక్ష్యాలను రెజ్లర్లు సమర్పించాలని ఛాలెంజ్ చేశారు. ఆందోళన చేస్తున్న ఐదు పదిమంది రెజ్లర్లను వదిలేసి, శిక్షణ తీసుకుంటున్న రెజ్లర్లను అడగండి నేను రాముడినో, రావణుడినో తెలుస్తుందని అన్నారు. నేను వేధించినట్లు ఒక్క చాటింగ్ కానీ, వీడియో కానీ చూపించాలని సవాల్ విసిరారు.

Exit mobile version