Brij Bhushan Sharan Singh: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసు.. బ్రిజ్ భూషణ్ సింగ్‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు
- ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు ఊరట
- లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా తేల్చిన కోర్టు
- మహిళా రెజ్లర్ల కేసులో తీర్పు వెలువరించిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brij Bhushan Sharan Singh: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన కేసులో మాజీ బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం ఆయనను, సహ నిందితుడు, మాజీ WFI అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌ను నిర్దోషులుగా విడుదల చేసింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు చేసిన ఫిర్యాదులకు సంబంధించి ఈ కేసు విచారణ కొనసాగింది. జూలై 2, 2026న ఇరుపక్షాల తుది వాదనలు పూర్తయ్యాయి. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసి, ఆగస్టు 3న వెలువరిస్తామని ప్రకటించింది. కేసు విచారణలో పలువురు సాక్షులను కోర్టు విచారించింది. ప్రాసిక్యూషన్ తరఫున ఫిర్యాదుదారులు సహా మొత్తం 32 మంది సాక్షులను విచారించినట్లు కోర్టు ప్రక్రియకు సంబంధించిన నివేదికలు వెల్లడించాయి.
2024లో అభియోగాలు నమోదు
2024 మేలో కోర్టు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై క్రిమినల్ బెదిరింపులకు సంబంధించిన అభియోగాలను నమోదు చేయాలని ఆదేశించింది. అదే సమయంలో ఆరుగురు ఫిర్యాదుదారుల్లో ఒక మహిళా రెజ్లర్ చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఆయనను డిశ్చార్జ్ చేసింది. సహ నిందితుడు వినోద్ తోమర్‌పై కూడా అభియోగాలు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. 2023 జూన్ 15న ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో బ్రిజ్ భూషణ్‌పై భారత శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 354, 354A, 354D, 506 కింద ఆరోపణలు నమోదయ్యాయి. వీటిలో మహిళపై దాడి లేదా బలప్రయోగం, లైంగిక వేధింపులు, వెంటపడటం, క్రిమినల్ బెదిరింపులు వంటి నేరాలు ఉన్నాయి. బ్రిజ్ భూషణ్ సింగ్, వినోద్ తోమర్ ఇద్దరూ విచారణ సమయంలో బెయిల్‌పై ఉన్నారు.
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు
ఈ కేసు 2023లో దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ, సామాజిక చర్చకు దారితీసింది. ప్రముఖ మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలు చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టారు. అనంతరం ఈ వ్యవహారం న్యాయస్థానాల దృష్టికి వెళ్లి, ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు బ్రిజ్ భూషణ్ సింగ్, వినోద్ తోమర్‌లను నిర్దోషులుగా విడుదల చేయడంతో ఈ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!