Site icon NTV Telugu

Uttar Pradesh: తాగుబోతు వరుడికి షాక్ ఇచ్చిన పెళ్లికూతురు..

Marriage Cancell

Marriage Cancell

Marriage Cancellation: ఇటీవల కాలంలో పెళ్లి పందిరిలోనే పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. అబ్బాయిలు, అమ్మాయిల ప్రవర్తన ఇందుకు కారణం అవుతోంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఓ పెళ్లి వేడుకలో వరుడికి షాక్ ఇచ్చింది పెళ్లికూతురు. వివాహ సమయానికి తాగి వచ్చిన వరుడితో పెళ్లికి నో చెప్పింది. బంధువులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా కూడా ససేమిరా అంది. చివరకు పెళ్లి రద్దైంది. ఉత్తర్ ప్రదేశ్ వారణాసి జిల్లాలో ఈ ఘటన జరిగింది. చౌబేపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గ్రామానికి చెందిన యువకుడితో జన్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని మరో గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది.

Read Also: Jabardasth Praveen: ఫైమాను మోసం చేసి మరో అమ్మాయిని పెళ్లాడిన ప్రవీణ్

ఆదివారం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే సాయంత్రం బుక్ చేసుకున్న ఫంక్షన్ హాల్ కు ఊరేగింపుగా వచ్చాడు వరుడు. అతని బంధువులు స్నేహితులు కూడా వేదికపైకి చేరారు. పెళ్లి కూతురు కూడా తన స్నేహితురాళ్లతో వేదికపైకి చేరుకుంది. వధూవరులు దండలు మార్చుకునే సమయంలో పెళ్లి కూతురు స్నేహితురాళ్లను చూసి వరుడి ఫ్రెండ్స్ గట్టిగా కేకలు వేశారు. అప్పటికే వారంతా మద్యం తాగి ఉన్నారు. దండలు మార్చుకునే సమయంలో వరుడు కూడా తాగి ఉన్నట్లు వధువు గమనించింది. దీంతో అతనితో పెళ్లి వద్దంటూ వేదికపై నుంచి దిగి తన గదిలోకి వెళ్లిపోయింది. బంధువులు గంటల తరబడి నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా, వధువు వినలేదు. చివరకు చేసేదేం లేక ఇరు కుటుంబాలు పెళ్లిని రద్దు చేసుకున్నాయి.

Exit mobile version