NTV Telugu Site icon

CIBIL score: ఇట్టా అయితే పెళ్లిళ్లు అయ్యేదెట్టా.. వరుడి సిబిల్ స్కోర్ తక్కువుందని పెళ్లి క్యాన్సిల్

Marriage

Marriage

పెళ్లంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలంటారు పెద్దలు. వివాహం తర్వాత ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఓ పెళ్లిలో మాత్రం ఈ విధానాన్ని తూచా తప్పకుండా పాటించారు. ఏకంగా వరుడి సిబిల్ స్కోర్ ను కూడా చెక్ చేశారు. ఇక్కడే వరుడికి షాక్ ఇచ్చారు అమ్మాయి తరపు బంధువులు. సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని ఆ పెళ్లిని క్యాన్సి్ల్ చేశారు. ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఇలా అయితే పెళ్లిల్లు అయ్యేదెట్లా అంటూ ఉసూరుమంటున్నారు పెళ్లికాని ప్రసాదులు.

ఈ మధ్యకాలంలో విచిత్ర ఘటనలతో పీటల మీది పెళ్లిళ్లు రద్దవుతున్నాయి. ఇటీవల ఓ చోట వరుడు చోళీకే పీచే అనే సాంగ్ కు డ్యాన్స్ చేశాడని వధువు తండ్రి ఆ పెళ్లిని క్యాన్సిల్ చేశాడు. ఇది మరవక ముందే ఇప్పుడు సిబిల్ స్కో్ర్ కారణంగా వివాహం రద్దు చేసుకున్నారు వధువు కుటుంబ సభ్యులు. మహారాష్ట్రలోని ముర్తిజాపూర్ లో అబ్బాయి, అమ్మాయి ఇద్దరు ఇష్టపడడంతో పెద్దలు వివాహం కుదిర్చారు. అన్ని విషయాలు మాట్లాడుకుని పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈ క్రమంలో అమ్మాయి మేనమామ అబ్బాయి సిబిల్ స్కోర్ ను చెక్ చేయాలని పట్టుబట్టాడు. పెద్దల సమక్షంలోనే సిబిల్ స్కోర్ చెక్ చేయగా స్కోర్ తక్కువగా ఉందని తేలింది.

వరుడు ఇది వరకే లోన్స్ తీసుకున్నాడని తేలింది. దీంతో అబ్బాయి ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చెందిన వధువు కుటుంబ సభ్యులు తమ కూతురును ఇచ్చి పెళ్లి చేసేందుకు నిరాకరించారు. నేటి కాలంలో మంచి కుటుంబం, అబ్బాయి గుణగణాలు, ఆస్తిపాస్తులు మాత్రమే కాకుండా సిబిల్ స్కోర్ కూడా చూస్తున్నారని తెలియడంతో పెళ్లి కాని యువకులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇలా అన్ని విషయాలు తెలుసుకోవడం మంచిదేనని అప్పుడే వధువు భవిష్యత్తుకు ఏ ఢోకా ఉండదని కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.