Site icon NTV Telugu

Strange Marriage: పెళ్లి నుంచి వరుడు పరార్.. వధువు ఏం చేసిందో తెలుసా?

Up Strange Marriage

Up Strange Marriage

Bride Chases Her Groom Who Is Trying To Escape From Marriage In UP: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి నుంచి పారిపోయేందుకు వరుడు ప్రయత్నించగా.. తన కుటుంబ సభ్యుల్ని వెంటేసుకుని మరీ వెళ్లి, అతడ్ని పట్టుకొని, పెళ్లి వేదికకి లాక్కొచ్చి పెళ్లి చేసుకుంది ఓ వధువు. ఆ వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని బారాదరి ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయికి రెండేళ్ల క్రితం ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల్లోనే అది ప్రేమగా మారింది. అప్పటి నుంచి ప్రేమల్లో మునిగితేలిన ఈ జంట.. పెళ్లి చేసుకొని, ఒక్కటి అవ్వాలని నిర్ణయించింది. తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి, వారికి తమ పెళ్లికి ఒప్పించారు కూడా!

Off The Record: ఏపీ ఉద్యోగ సంఘాలకు ఉమ్మడి లక్ష్యం లేదా? ఎందుకు వెనకబడిపోతున్నారు?

ఇరువైపుల కుటుంబాల అంగీకారంతో.. మే 21వ తేదీన భూతేశ్వర్ నాథ్ ఆలయంలో ఆ జంట వివాహానికి ఏర్పాట్లు చేశారు. ఇరు కుటుంబ సభ్యులు, ఇతర బంధుమిత్రులు పెళ్లివేదికకి చేరుకున్నారు. కానీ.. వరుడు మాత్రం రాలేదు. ముహూర్తం సమీపిస్తున్నా.. వరుడి జాడ కనిపించలేదు. తన కాబోయే భర్త కోసం ఎదురుచూసి చూసి.. ఇక లాభం లేదనుకొని వధువు అతనికి ఫోన్ చేసింది. ఎక్కడున్నావ్? ఇక్కడ నీకోసం అందరం వేచి చూస్తున్నాం? ముహూర్తం సమయం కూడా దాటిపోతోంది? ఎంతసేపట్లో వస్తావ్? అని ప్రశ్నించింది. అప్పుడు వరుడు ఆమెకు ఒక్కసారిగా ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ‘‘నన్ను క్షమించు, నేను మా అమ్మాని తీసుకురావడం కోసం బుదాన్ ఊరికి వెళ్తున్నాను’’ అంటూ సమాధానం ఇచ్చాడు. తన తల్లి పేరు చెప్పి, అతడు ఈ పెళ్లి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాడు.

CM KCR: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు.. గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ

వరుడి ఉద్దేశం అర్థం చేసుకున్న వధువు.. మరో క్షణం ఆలస్యం చేయకుండా, తన వాళ్లను వెంట పెట్టుకొని వరుడి కోసం వెళ్లింది. అతడు ఎక్కడున్నాడో తెలుసుకుని, ఆ ప్రాంతానికి పరుగులు పెట్టింది. బరేలీకి 20 కిలోమీటర్ల దూరంలో భిమోర పోలీసు స్టేషన్ పరిధిలో వరుడు బస్సు ఎక్కుతుండడాన్ని వధువు గమనించింది. ఇంకేముంది.. అతడ్ని పట్టుకొని, రెండు-మూడు తగిలించి, పెళ్లి మండపానికి లాక్కొచ్చారు. అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేశారు.

Exit mobile version