ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కర్కర్దుమా మెట్రో స్టేషన్ సమీపంలో గల రిషబ్ టవర్‌లోని 6వ అంతస్థులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు 14 ఫైర్ ఇంజన్లను రంగంలోకి దింపి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఇప్పటికే కాలుష్యపు పొగమంచుతో నిండిన ఢిల్లీలో ఈ ఘటనతో మరింత పొగ అలుముకుంది.
