Site icon NTV Telugu

Pragya Singh Thakur: మీ కూతుర్లు హిందూయేతరులతో వెళ్తే కాళ్లు విరగ్గొట్టండి..

Pragnya

Pragnya

Pragya Singh Thakur: బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. వివరాల్లోకి వెళితే, ఈ నెల ప్రారంభంలో భోపాల్‌లో జరిగిన ఒక ధార్మిక కార్యక్రమంలో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల కోరికలకు వ్యతిరేకంగా తమ కుమార్తెలు ప్రవర్తిస్తే వారిని శారీరకంగా శిక్షించాలని సూచించారు. అలాగే, మీ కుమార్తె మాట వినకుండా హిందూయేతరుల ఇంటికి వెళితే, ఆమె కాళ్లు విరగ్గొట్టడానికి ఏ మాత్రం వెనుకాడకండి అని పేర్కొనింది. విలువలను పాటించనివారు, తల్లిదండ్రుల మాట విననివారు శిక్షార్హులు అని చెప్పుకొచ్చింది. మీ పిల్లల మంచి భవిష్యత్తు కోసం వారిని కొట్టాల్సి వస్తే వెనకడుగు వేయకండి అని తెలిపింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Read Also: Ram Pothineni : దాని కారణంగా.. ఒక్క రాత్రిలో మా కుటుంబం రోడ్డున పడిపోయింది

అయితే, మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ దేశంలో బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతుందని కాంగ్రెస్ ప్రతినిధి భూపేంద్ర గుప్తా ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో కేవలం ఏడు మత మార్పిడుల కేసుల్లోనే శిక్ష పడితే, ఇంత గోల, విద్వేషం ఎందుకు వ్యాప్తి చేస్తున్నారు? అని ప్రశ్నించారు. దేశంలోని ప్రజలను మత ప్రాతిపాదికన బీజేపీ విభజిస్తుంది అని పేర్కొన్నారు.

Exit mobile version