Site icon NTV Telugu

Brazil Woman Arrested: బ్రెజిల్ మహిళ శరీరంలో 124 కొకైన్ క్యాప్సూల్స్.. ముంబైలో అరెస్టు..!

Drugs

Drugs

Brazil Woman Arrested: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో కొకైన్ సరపరా చేస్తున్న బ్రెజిల్ మహిళను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అరెస్టు చేశారు. డ్రగ్స్ తీసుకొస్తున్న వచ్చిన సమాచారం మేరకు ఆమెను ఆరా తీయడంతో పాటు క్షేత్ర స్థాయిలో పరీక్షలు చేయగా.. 973 గ్రాముల కొకైన్‌తో కూడిన 124 క్యాప్సూల్స్‌ ఉన్నట్లు గుర్తించారు. దీంతో కొకైన్‌గా భావించబడే పదార్థాన్ని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ పదార్ధాల (NDPS) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణికురాలిని అరెస్టు చేశారు.

Read Also: Kamareddy: దారుణం.. డబ్బులు కట్టలేదని వేసిన కుట్లు విప్పేశారు..

కాగా, భారతదేశంలో స్మగ్లింగ్ కోసం తీసుకువస్తున్న సదరు మహిళను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఆమె దగ్గర నుంచి తీసుకున్న డ్రగ్స్ విలువ సుమారు 9.73 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్‌లోని ఇతర సభ్యుల జాడ కోసం బ్రెజిల్ మహిళను విచారిస్తున్నారని DRI అధికారి చెప్పారు. ఈ విచారణలో డ్రగ్స్‌తో కూడిన క్యాప్సూల్స్‌ను తన శరీరంలోకి తీసుకుని భారత్‌లోకి స్మగ్లింగ్ చేస్తున్నట్టు సదరు ప్రయాణికురాలు ఒప్పుకుంది. ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి.. ఇక్కడి నుంచి జేజే ఆస్పత్రిలో చేర్చారు. సదరు బ్రెజిల్ మహిళ తీసుకొచ్చి డ్రగ్స్ విలువ బ్లాక్ మార్కెట్‌లో సుమారు రూ. 9.73 కోట్ల ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Exit mobile version