NTV Telugu Site icon

Love Tragedy: ప్రేమ పేరుతో మోసం చేసిందని.. ఇంట్లోకి చొరబడి..

Boyfriend Killed Gf Father

Boyfriend Killed Gf Father

Boyfriend Killed His Girlfriend Father For Betraying Him In Uttar Pradesh: ప్రేమ పేరుతో తనని మోసం చేసిందన్న కక్షతో ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. ఆ యువతితో పాటు ఆమె తండ్రిపై కాల్పులు జరిపాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాజపూర్‌ జిల్లాలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. సుభాష్ ఖరాడి అనే 25 ఏళ్ల యువకుడు దేవాస్‌ నగరంలో పోలీస్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఆ సమయంలోనే అతనికి శివాని అనే యువతి పరిచయం అయ్యింది. కొన్నిరోజుల్లోనే అది ప్రేమగా మారింది. ఇక అప్పటి నుంచి ప్రేమలో మునిగితేలిన ఈ జంట.. పెళ్లి చేసుకొని, ఒక్కటవ్వాలని భావించింది. తమ కుటుంబసభ్యుల్ని ఒప్పించి, పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

New Parliament Building: కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన సీపీఐ(ఎం)

అయితే.. శివాని కుటుంబసభ్యులు వారి పెళ్లిని అంగీకరించలేదు. సుభాష్‌ని దూరం పెట్టాలని వాళ్లు శివానిని సూచించారు. ఆమెకు మరో దారి లేక.. తన ఫ్యామిలీ చెప్పినట్టు సుభాష్‌ని శివాని దూరం పెట్టింది. అప్పటి నుంచి శివాని, ఆమె కుటుంబ సభ్యులపై సుభాష్‌ కక్ష పెంచుకున్నాడు. తనని కాదన్నందుకు వాళ్లను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి మలిఖేడి గ్రామంలో ఉంటున్న శివాని ఇంట్లోకి సుభాస్ చొరబడ్డాడు. తనతో పాటు తెచ్చుకున్న కంట్రీమేడ్ తుపాకితో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ కాల్పుల్లో శివాని తండ్రి జాకీర్ అక్కడికక్కడే మృతి చెందగా.. శివాని, ఆమె సోదరుడు ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శివాని సోదరుడు కోలుకుంటుండగా.. శివాని పరిస్థితి మాత్రం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Hansika Motwani: క్యాస్టింగ్ కౌచ్ వార్తలపై హన్సిక సీరియస్.. గుడ్డిగా రాయొద్దంటూ వార్నింగ్

మరోవైపు.. సుభాష్ ఇలా కాల్పులు జరిపిన తర్వాత ఫేస్‌బుక్‌లో శివానితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు. ‘‘ప్రేమ పేరుతో ఆ అమ్మాయి నాకు ద్రోహం చేసింది. అందుకే కాల్పులు జరిపా. అయితే.. ఆమెను చంపలేదు కానీ, జీవితాంతం మర్చిపోలేని బాధను ఇచ్చాను’’ అంటూ పోస్ట్ చేశాడు. అతడ్ని పట్టుకోవడం కోసం పోలీసులు వెంటనే రంగంలోకి దిగగా.. కొన్ని గంటలకే అతడి మృతదేహం రైల్వే ట్రాక్‌పై కనిపించింది. కదులుతున్న రైలు నుంచి సుబాష్ కిందకు దూకి.. ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Show comments