Site icon NTV Telugu

Bomb Threat: ఢిల్లీ స్కూళ్లు, కోర్టులకు మరోసారి బాంబ్ బెదిరింపులు.. డాగ్‌స్క్వాడ్స్‌తో తనిఖీలు

Bomb Threats

Bomb Threats

దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట దగ్గర కారు బ్లాస్ట్ మరువక ముందే తాజాగా బాంబ్ బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. స్కూళ్లు, కోర్టులకు బెదిరింపులు వచ్చాయి. పాటియాలా హౌస్, సాకేత్ కోర్టులతో పాటు రెండు సీఆర్పీఎఫ్ స్కూళ్లకు కూడా బాంబ్ బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు, బాంబ్ స్క్వాడ్స్, డాగ్ స్వ్కాడ్స్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. కోర్టు ఆవరణలు ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు.

ఇది కూడా చదవండి: Nitish Kumar: 20నే సీఎంగా నితీష్ ప్రమాణం.. మంత్రివర్గ కూర్పుపై కసరత్తు

నవంబర్ 10న ఎర్రకోట దగ్గర కారు బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది చనిపోయారు. అలాగే ఉగ్రవాది ఉమర్ కూడా హతమయ్యాడు. దేశ వ్యాప్తంగా డాక్టర్ల బృందం భారీ దాడులకు కుట్ర చేస్తుండగా కారు బ్లాస్ట్ జరిగింది. ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుట్రలో భాగమైన పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Exit mobile version