Boat capsized: బీహార్‌లో ఘోరం.. 33 మంది పిల్లలతో వెళ్తున్న పడవ బోల్తా.. 16 మంది గల్లంతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boat capsized: బీహార్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. 33 మంది పిల్లలతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటన గురువారం రోజున ముజఫర్ పూర్ జిల్లాలో జరిగింది. బాగ్‌మతి నదిలో పడవ ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. విషయం తెలిసిన వెంటనే ఎస్డీఆఫ్ఎఫ్ బలగాలు రెస్య్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 17 మంది చిన్నారులను రక్షించగా.. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
సీఎం నితీష్ కుమార్ పర్యటన నేపథ్యంలో ఈ పెను ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు 17 మంది పిల్లల్ని రక్షించగా.. 16 మంది గల్లంతయ్యారని తెలుస్తోంది. వీరి కోసం డైవర్లు గాలిస్తున్నారు. పిల్లలతో నిండిన పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. డైవర్లతో పాటు స్థానికంగా ఉన్న గ్రామస్తులు సహాయక చర్యలను ప్రారంభించారు. గైఘాట్‌లోని బెనియాబాద్ ఓపీ ప్రాంతంలోని మధుపట్టి ఘాట్ వద్ద పడవ బోల్తా పడిన ప్రమాదం జరిగినట్లు సమాచారం. పడవలో దాదాపు 33 మంది చిన్నారులు ఉన్నారు. బ్యాలెన్స్ కోల్పోవడంతో బోటు నదిలో బోల్తా పడినట్లు తెలుస్తోంది.
Also Read
గైఘాట్, బెనియాబాద్ పోలీసులతో పాటు ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం సంఘటనా స్థలంలో చర్యలు ప్రారంభించిందని జిల్లాకు చెందిన ఒక ఉన్నత అధికారి తెలిపారు.పిల్లలు పడవలో స్కూలుకు వెళ్తున్నారని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే పిల్లల కుటుంబ సభ్యులు నది వైపు పరుగులు తీశారు. చిన్నారులను రక్షించేందుకు గ్రామస్తులు నదిలోకి దూకారు. దీంతో చాలా మంది పిల్లల్ని కాపాడగలిగారు. ఘటనా ప్రాంతంలో పిల్లల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
ముజఫర్‌పూర్ లో క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించేందుకు ఈ రోజు సీఎం నితీష్ కుమార్ వస్తున్నారు. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది. పడవ బోల్తా విషయాన్ని స్థానిక పోలీసులు సీరియస్ గా తీసుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్ మొదలు కావడానికి ఆలస్యమైందని ఆరోపించారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు