Site icon NTV Telugu

Boat capsized: బీహార్‌లో ఘోరం.. 33 మంది పిల్లలతో వెళ్తున్న పడవ బోల్తా.. 16 మంది గల్లంతు..

Bihar

Bihar

Boat capsized: బీహార్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. 33 మంది పిల్లలతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటన గురువారం రోజున ముజఫర్ పూర్ జిల్లాలో జరిగింది. బాగ్‌మతి నదిలో పడవ ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. విషయం తెలిసిన వెంటనే ఎస్డీఆఫ్ఎఫ్ బలగాలు రెస్య్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 17 మంది చిన్నారులను రక్షించగా.. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

సీఎం నితీష్ కుమార్ పర్యటన నేపథ్యంలో ఈ పెను ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు 17 మంది పిల్లల్ని రక్షించగా.. 16 మంది గల్లంతయ్యారని తెలుస్తోంది. వీరి కోసం డైవర్లు గాలిస్తున్నారు. పిల్లలతో నిండిన పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. డైవర్లతో పాటు స్థానికంగా ఉన్న గ్రామస్తులు సహాయక చర్యలను ప్రారంభించారు. గైఘాట్‌లోని బెనియాబాద్ ఓపీ ప్రాంతంలోని మధుపట్టి ఘాట్ వద్ద పడవ బోల్తా పడిన ప్రమాదం జరిగినట్లు సమాచారం. పడవలో దాదాపు 33 మంది చిన్నారులు ఉన్నారు. బ్యాలెన్స్‌ కోల్పోవడంతో బోటు నదిలో బోల్తా పడినట్లు తెలుస్తోంది.

గైఘాట్, బెనియాబాద్ పోలీసులతో పాటు ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం సంఘటనా స్థలంలో చర్యలు ప్రారంభించిందని జిల్లాకు చెందిన ఒక ఉన్నత అధికారి తెలిపారు.పిల్లలు పడవలో స్కూలుకు వెళ్తున్నారని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే పిల్లల కుటుంబ సభ్యులు నది వైపు పరుగులు తీశారు. చిన్నారులను రక్షించేందుకు గ్రామస్తులు నదిలోకి దూకారు. దీంతో చాలా మంది పిల్లల్ని కాపాడగలిగారు. ఘటనా ప్రాంతంలో పిల్లల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

ముజఫర్‌పూర్ లో క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించేందుకు ఈ రోజు సీఎం నితీష్ కుమార్ వస్తున్నారు. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది. పడవ బోల్తా విషయాన్ని స్థానిక పోలీసులు సీరియస్ గా తీసుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్ మొదలు కావడానికి ఆలస్యమైందని ఆరోపించారు.

Exit mobile version