కర్ణాటకలో ఓ కుమారుడు తన తల్లి మరణంతో తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. అయితే తను ఏం చేశాడంటే.. ఏకంగా కోట్ల విలువ చేసే బీఎండబ్ల్యూ కారును కావేరి నదిలో పడేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే కావేరి నదిలో ఎర్రని బీఎండబ్ల్యూ కార్ తేలడాన్ని ఇటీవల నది వద్ద శ్రీరంగపట్నం గ్రామస్తులు గమనించారు. ముందుగా ఏదో ప్రమాదం జరిగిందనుకుని పోలీసులకు సమాచారం అందిచారు. ఎవరైనా కారుతో సహా మునిగిపోయారా..అని ఘటన స్థలంలో రెస్క్యూ సిబ్బందితో గాలించారు. తరువాత కారులో ఎవరూ లేరని గుర్తించారు.
కారు ఎవరదనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. రిజస్ట్రేషన్ వివరాలను బట్టి కారు బెంగళూర్ లోని మహాలక్ష్మీ లేఅవుట్ లో నివసించే వ్యక్తికి చెందిందిగా గుర్తించారు. వివరాలు తెలుసుకునేందుకు సదరు కారు యజమానిని పోలీసులు శ్రీరంగపట్నం తీసుకెళ్లి విచారించారు. అయితే పోలీసులు ఎంత ప్రశ్నించినా.. సమాధానం రాకపోవడంతో కుటుంబ సభ్యులను పిలిచి విచారించారు. అయితే ఇటీవల అతని తల్లి చనిపోయిందని అప్పటి నుంచి తీవ్ర డిప్రెషన్ కు గురువుతున్నాడని పోలీసులకు వెల్లడించారు కుటుంబ సభ్యులు.
కోట్ల రూపాయల కారును ఇలా నదిలో పడేయడం సంచనంగా మారింది. తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు ఉన్న ఈ రోజుల్లో తల్లి మరణంతో బాధపడుతూ కోట్ల రూపాయల కారును నదిలే పడేశాడు. ఇండియాలో బీఎండబ్ల్యూ ఎక్స్ 6 ఎస్‌యూవీ విలువ రూ. 1.3 కోట్లు (ఎక్స్-షోరూమ్). భారతీయ మార్కెట్లో అత్యంత విలాసవంతమైన బీఎండబ్ల్యూ ఎక్స్ 6 ఎస్‌యూవీ ఒకటి.