NTV Telugu Site icon

ఒకే వ్యక్తిలో బ్లాక్, వైట్ ఫంగస్… 

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని, మనుషుల జీవితాలను ఎలా మార్చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు.  కరోనా మహమ్మారి బారిన పడి ఎలాగోలా కోలుకున్నా, బ్లాక్ ఫంగస్ వంటి రోగాలు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి.  కరోనా బారిన పడిన వ్యక్తుల్లో చాలా మంది బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు.  బ్లాక్ ఫంగస్ కు అందించాల్సిన వైద్యం ఖరీదు కావడం, ఇంజెక్షన్లు తగినన్ని అందుబాటులో లేకపోవడంతో మరణాలు సంభవిస్తున్నాయి. ఇక బ్లాక్ ఫంగస్ తో పాటుగా వైట్ ఫంగస్ కూడా విజృంభిస్తోంది.  అయితే, మధ్యప్రదేశ్ కు చెందిన ఓ రోగి శరీరంలో బ్లాక్ ఫంగస్ తో పాటుగా వైట్ ఫంగస్ ను కూడా గుర్తించారు.  గ్వాలియర్ కు చెందిన వ్యక్తి శరీరంలో రెండు రకాల ఫంగస్ లు బయటపడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.