Site icon NTV Telugu

Annamalai: మేకకు అన్నామలై ఫోటో తగిలించి, నడిరోడ్డుపై తలనరికి డీఎంకే సంబరాలు.. వీడియో వైరల్..

Annamalai

Annamalai

Annamalai: తమిళనాడులో అధికార డీఎంకేకి తలనొప్పిగా మారిన బీజేపీ చీఫ్ అన్నామలై కోయంబత్తూర్ నుంచి ఓడిపోవడంతో ఆ పార్టీ సంబరాల్లో మునిగింది. డీఎంకే కార్యకర్తలు తమ పార్టీ అభ్యర్థి గెలుపొందడం కన్నా, అన్నామలై ఓటమినే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటున్నట్లుగా ఉన్నారు. తాజాగా ఓ వీడియో డీఎంకే మద్దతుదారులు చేసుకున్న సంబరాలు వివాదాస్పదమయ్యాయి. కోయంబత్తూర్ ఎంసీ స్థానం నుంచి అన్నామలై, డీఎంకే అభ్యర్థి గణపతి రాజ్‌కుమార్ చేతిలో ఓడిపోయారు.

దీనిని సెలబ్రేట్ చేసుకుంటూ డీఎంకే మద్దతుదారులు మేకకు అన్నామలై ఫోటో తగిలించి, నడిరోడ్డుపై కర్కశంగా కత్తితో దాని తలనరికారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అన్నామలై మేక అంటూ నినాదాలు చేయడం వినవచ్చు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. డీఎంకేది ఐఎస్ఐఎస్ తరహా ద్వేషం అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఎక్స్‌లో విమర్శించారు. అన్నామలై మేకలు పెంచే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు, గతంలో డీఎంకే దీనిపై కూడా ఎగతాళి చేసింది.

Read Also: Brahmaji : వాళ్ళు తప్పు చేస్తే మీరు అదే తప్పు చేయకూడదు.. ఏపీ పాలిటిక్స్ పై బ్రహ్మాజీ హాట్ కామెంట్స్

దీనిని ఫాసిజం అంటారని, తమిళనాడు, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో తీవ్ర శతృత్వ ఉందని కానీ వారు రాజ్యాంగాన్ని కాపాడాలంటూ చెబుతారని, దీనిపై నకిలీ ఉదారవాదులు మౌనంగా ఉంటారని పూనావాలా అన్నారు. సనాతన వ్యతిరేక కూటమి హిందువులను ఇలాగే చంపేస్తుందని మరో బీజేపీ నేత అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు.

అయితే, ఈ ఘటనపై డీఎంకే పార్టీ స్పందించింది. ఆ పార్టీ జాయింట్ సెక్రటరీ కొట్టాయ్ అబ్బాస్ మాట్లాడుతూ.. ‘‘డీఎంకే లేదా డీఎంకే కార్యకర్తలు అయితే ఇలా మేకను వధించేవారు కాడు, మా నాయకుడు అలాంటి చర్యల్లో పాల్గొనమని ఎప్పుడూ మాకు మార్గనిర్దేశం చేయలేదు. వైరల్ అవుతున్న వీడియోని చూశాము, ఇది డీఎంకే కార్యకర్తలు చేయలేదని అనుకుంటున్నాను. ఈ వీడియో కోయంబత్తూర్ నుంచి వచ్చింది కాదు’’ అని అన్నారు.

Exit mobile version