పంజాబ్‌లో ఈనెల 20 వ తేదీన అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 14 న ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ, పంజాబ్ సిక్కుగురు జయంతి వేడుకలు ఉండటంతో ఎన్నికలను వాయిదా వేశారు. ఫిబ్రవరి 20 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు తమదైన హామీలు ఇస్తూ మ్యానిఫెస్టోను రూపొందిస్తున్నాయి. తాజాగా బీజేపీ కూటమి మ్యానిఫెస్టోను విడుదల చేసింది. పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్, శిరోమణి అకాళిదళ్ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. మూడు పార్టీలు కలిసి మ్యానిఫెస్టోను తయారు చేసి ఈరోజు రిలీజ్ చేశాయి.
Read: Election Commission: పాదయాత్రలు ర్యాలీలకు గ్రీన్ సిగ్నల్… కానీ…
రాష్ట్రంలో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే పంజాబ్ యువతకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ప్రైవేటు ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు. అంతేకాదు, నిరుద్యోగులకు రెండేళ్లపాటు రూ. 4 వేల చొప్పున నిరుద్యోగ బృతి కల్పిస్తామని తెలిపారు. మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. సంకల్ప్ డాక్యుమెంట్ పేరిట బీజేపీ ఈ మ్యానిఫెస్టోను రూపొందించింది. ఇక ఈ ఎన్నికల్లో నామినేషన్ వేసే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా డోపింగ్ టెస్టులు చేయించుకోవాలని బీజేపీ కూటమి నిర్ణయించింది.
