ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి బాధ్యతలు స్వీకరించనున్నారు.. సీఎంగా పుష్కర్ సింగ్ ధామి పేరును ఖరారు చేసింది బీజేపీ.. దీంతో.. తదుపరి సీఎం ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. నిన్న తీరథ్‌సింగ్ రావత్ రాజీనామా చేయడంతో సీఎం పదవి ఖాళీ అయ్యింది.. అయితే, ఇవాళ జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో పుష్కర్ సింగ్ ధామిని ఎన్నుకున్నారు. డెహ్రాడూన్ లో కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ వ్యవహారల ఇంఛార్జ్ నరేంద్రసింగ్ తోమర్ సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. కాగా, ఉత్తరాఖండ్‌లో నాలుగు నెలల వ్యవధిలో పుష్కర్‌సింగ్ ధామి మూడో సీఎం.. ఆయన ఉదమ్‌సింగ్ నగర్ జిల్లాలోని ఖతిమా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు.
ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా పుష్కర్ సింగ్ ధామి

Pushkar Singh Dham