BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం

  • స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్
  • పురంధేశ్వరికి ఒడిషా బాధ్యతలు
  • యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
Smritiirani

Smritiirani

వచ్చే ఏడాదిలో ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌ బీజేపీకి కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురికి అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. తాజాగా మరోసారి పలు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇంఛార్జ్‌లు, సహా ఇంఛార్జ్‌లను నియమించింది.

ఇటీవలే స్మృతి ఇరానీని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తాజాగా రెండు రాష్ట్రాలకు ఇంఛార్జ్‌గా నియమించారు. హర్యానా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు. ఇక సునీల్ బన్సల్‌కు పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు. ఇక ఒడిషాకు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరిని ఇంఛార్జ్‌గా నియమించగా.. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే.అరుణను తమిళనాడు సహా ఇంఛార్జ్‌గా బీజేపీ అధిష్టానం నియమించింది.

ఇక ఉత్తరప్రదేశ్‌కు వినోద్ తావ్డేను రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్‌ బాధ్యతలు అప్పగించింది. రామ్ మాధవ్ ఉత్తరాఖండ్‌కు కొత్త ఇన్‌చార్జ్‌గా నియమితులవ్వగా.. బాన్సురి స్వరాజ్ సహ-ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఇక వినయ్ సహస్రబుద్ధే బీజేపీ ఢిల్లీ విభాగానికి ఇన్‌చార్జ్‌గా నియమితులయ్యారు. జమ్యాంగ్ నమ్‌గ్యాల్, దర్శనా జర్దోష్‌లు కో-ఇన్‌చార్జ్‌లుగా నియమితులయ్యారు.

అండమాన్ మరియు నికోబార్‌కు జై ప్రకాష్, అరుణాచల్ ప్రదేశ్‌కు డాక్టర్ దేవేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్‌కు డాక్టర్ అరవింద్ భదౌరియా, సహా ఇంఛార్జ్‌గా వనతి శ్రీనివాసన్, అస్సాంకు మంగళ్ పాండే, సహా ఇంఛార్జ్‌గా ఫాంగ్నాన్ కోన్యాక్, మనోజ్ టిగ్గా, బీహార్‌కు హరీష్ ద్వివేది, సహా ఇంఛార్జ్‌గా సంగీత యాదవ్, రోహన్ గుప్తా, చండీగఢ్‌కు మహేంద్ర పాండే, ఛత్తీస్‌గఢ్‌కు స్మృతి ఇరానీ, సహా ఇంఛార్జ్‌గా సిద్ధార్థ శంభు, దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ మరియు డయ్యూ వర్షాబెన్ నరేంద్ర భాయ్ దోషి, ఢిల్లీకి డాక్టర్ వినయ్ సహస్రబుద్ధే, గోవాకు డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, సహా ఇంఛార్జ్‌గా అనిల్ ఆంటోనీని నియమించారు.

గుజరాత్‌కు తరుణ్ చుగ్, సహా ఇంఛార్జ్‌గా అజయ్ మహావార్, గోమతి సాయి, హర్యానాకు స్మృతి ఇరానీ, సహా ఇంఛార్జ్‌గా డాక్టర్ భోలా సింగ్, హిమాచల్ ప్రదేశ్‌కు శ్రీకాంత్ శర్మ, సహా ఇంఛార్జ్‌గా దర్శన సింగ్, జమ్మూ కాశ్మీర్‌కు డాక్టర్ సతీష్ పూనియా, సహ ఇంఛార్జ్‌గా రీనా కశ్వప్, జార్ఖండ్‌కు గజేంద్ర పటేల్, సహా ఇంఛార్జ్‌గా సౌరభ్ సింగ్, నివేదిత సింగ్, కర్ణాటకకు హరీష్ ద్వివేది, సహా ఇంఛార్జ్‌గా డాక్టర్. ఎం. వెంకటేశ్వర్లు, కేరళకు ప్రొఫెసర్ ఎం. నాగరాజు, సహా ఇంఛార్జ్‌గా ఎం.వెంకటేశన్, లడఖ్‌కు రాజ్‌కుమార్ భాటియా, లక్షద్వీప్‌కు జార్జ్ కురియన్, మధ్యప్రదేశ్‌కు బితుల్ కుమార్ దేబ్, సహ ఇంఛార్జ్‌గా రేఖ వర్మ, మహారాష్ట్రకు జైజయంత జయ పాండా, సహ ఇంఛార్జ్‌లుగా అమిత్ మాల్వియా, సదానంద్ షెట్ తనువాడే, కమల్జీత్ సెహ్రావత్, మణిపూర్‌కు డాక్టర్ రాజ్‌దీప్ రాయ్, మేఘాలయ‌కు కనద్ పుర్కాయస్థ, సహ ఇంఛార్జ్‌గా డాక్టర్ నుమల్ మోస్మాన్, మిజోరాంకు డాక్టర్ భగవత్ కరాడ్, నాగాలాండ్‌కు అనిల్ ఆంటోనీ, ఒడిశాకు పురందేశ్వరి, సహ ఇంఛార్జ్‌గా డాక్టర్ స్వదేశ్ సింగ్, పుదుచ్చేరికు కె.సురేంద్రన్‌ను నియమించారు.

పంజాబ్‌కు డాక్టర్ సతీష్ పూనియా, సహ ఇంఛార్జ్‌లుగా వీరేంద్ర సచ్‌దేవ్, డా.అల్కా గుర్జర్, రాజస్థాన్‌కు సంజయ్ భాటియా, సహ ఇంఛార్జ్‌లుగా కవితా పటీదార్, కుల్జీత్ చాహల్, సిక్కింకు రాజు బిష్ట్, తమిళనాడుకు రామ్ మాధవ్, సహ ఇంఛార్జ్‌లుగా నిర్మల్ కుమార్ సురానా, డీకే. అరుణ, తెలంగాణకు సునీల్ బన్సల్, సహ ఇంఛార్జ్‌లుగా అభయ్ పాటిల్, రేఖా శర్మ, త్రిపురకు మృగాంక దేవ్ బర్మన్, ఉత్తరప్రదేశ్‌కు వినోద్ తావ్డే, సహ ఇంఛార్జ్‌లుగా జగదీష్ పటేల్, మేధా కులకర్ణి, డాక్టర్ ప్రదీప్ శర్మ, అనంత్ ఓజా, ఉత్తరాఖండ్‌కు రామ్ మాధవ్, సహ ఇంఛార్జ్‌లుగా అరవింద్ మేనన్, బాన్సురి స్వరాజ్, పశ్చిమ బెంగాల్‌కు సునీల్ బన్సల్, సహ ఇంఛార్జ్‌లుగా లాల్ సింగ్ ఆర్య, రాజేంద్ర సింగ్, పింకీ కుష్వాహ‌లను నియమించారు.