దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముచ్చటగా మూడోసారి యూపీలో అధికారంలోకి వచ్చేందుకు కమలనాథులు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని మేధోమథనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పదవుల పందెరం చేపట్టారు.
కొత్త జాతీయ కార్యవర్గాన్ని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 13 మందికి జాతీయ ఉపాధ్యక్ష పదవులు దక్కాయి. ఇందులో రాజమండ్రి ఎంపీ పురందేశ్వరికి కూడా ఉపాధ్యక్ష పదవి లభించింది. ఇక బీజేపీ జనరల్ సెక్రటరీ పదవిని స్మృతి ఇరానీకి కట్టబెట్టగా.. జాతీయ ట్రెజరర్‌గా పీయూష్ గోయల్, బీజేపీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా మరోసారి బీఎల్ సంతోష్‌కు అప్పగించారు.
జాతీయ ఉపాధ్యక్షులుగా వీరు
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా వసుంధర రాజే సింధియా, తీరత్ సింగ్ రావత్, రామ్ మాధవ్, బైజయంత్ జయ్ పాండా, డి. పురందేశ్వరి, రేఖా వర్మ, వర్షాబెన్ నరేంద్రభాయ్ దోషి, భారతి ప్రవీణ్ పవార్, మన్‌ప్రీత్ సింగ్ బాదల్, లాల్ సింగ్ ఆర్య, ఎం. నాగరాజ, తారిఖ్ మన్సూర్, మధుచంద్ర కర్లను నియమించారు.
జాతీయ ప్రధాన కార్యదర్శులుగా…
ఇక వినోద్ తావ్డే, స్మృతి ఇరానీలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో వీరికి కీలక బాధ్యతలు అప్పగించారు.
కోశాధికారిగా గోయల్
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను బీజేపీ జాతీయ కోశాధికారిగా నియమించారు. కొత్తగా ప్రకటించిన ఆఫీస్ బేరర్లతో పార్టీ సంస్థాగత వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై నితిన్ నబీన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
BJP chief Nitin Nibin announces names of new office bearers.
Vasundhara Raje Scindia, Tirath Singh Rawat, Ram Madhav, Baijyant Jay Panda, D Purandeshwari, Rekha Verma, Varshaben Narendrabhai Doshi, Bharti Pravin Pawar, Manpreet Singh Badal, Lal Singh Arya, M. Nagaraja, Tariq… pic.twitter.com/dnPE95CDVY
— ANI (@ANI) August 17, 2026

