Site icon NTV Telugu

MP Saumitra Khan: స్వామి వివేకానంద మోదీ రూపంలో మళ్లీ జన్మించాడు.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..

West Bengal Bjp Mp

West Bengal Bjp Mp

MP Saumitra Khan: పశ్చిమ బెంగాల్ కు చెందిన బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ గురువారం ప్రధాని మోదీని, స్వామి వివేకనందతో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జరిగిన ఓ కార్యక్రమంలో స్వామి వివేకానంద మోదీ రూపంలో మళ్లీ జన్మించాడని వ్యాఖ్యలు చేశాడు. స్వామీజీ ప్రధాని మోదీగా పునర్జన్మ తీసుకున్నారని.. మాకు స్వామీజి దేవుడితో సమానం అని ఆయన అన్నారుర. ప్రధాని తన తల్లి చనిపోయినప్పుడు కూడా దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన విధానం, అతడు ఆధునిక భారతదేశానికి నవయుగా వివేకానందగా భావిస్తున్నాను అని ఖాన్ అన్నారు. మాకు స్వామీజీ దేవుడితో సమానం అని అన్నారు.

Read Also: Waltair Veerayya: ఓటీటీ దిగ్గజం చేతికి మెగా సినిమా…

అయితే ఈ వ్యాఖ్యలపై అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మండిపడుతోంది. టీఎంసీ పార్టీ కీలక నేత కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ ఖాన్ ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది స్వామి వివేకానందకు అవమానమని అన్నారు. స్వామి వివేకానంద భావజాలం, బీజేపీ భావజాలానికి పూర్తిగా వ్యతిరేకమని అన్నారు.ఇదిలా ఉంటే ప్రధాని మోదీని వివేకానందతో పోల్చడం ఇదే తొలిసారి కాదు. గతంలో కొన్ని సందర్బాల్లో పలువురు బీజేపీ నాయకులు ఇదే విధంగా వ్యాఖ్యలు చేశారు. గతంలో బీహార్ బీజేపీ అధ్యక్షుడు నిత్యానంద్ రాయ్ కూడా ప్రధాని మోదీ, వివేకానందుడికి పునర్జన్మ అని అన్నాడు.

గురువారం స్వామి వివేకానంద జయంతిని సందర్భంగా ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. వివేకానందుడి గొప్ప ఆదర్శాలు మరియు ఆలోచనలు తమ దేశ ప్రజలకు మార్గదర్శకంగా కొనసాగుతాయని అన్నారు. వివేకానందుడి జయంతి సందర్భంగా ప్రతీ ఏడాది యువజన దినోత్సవం జరుపుకుంటాం. దీంట్లో భాగంగా కర్ణాటకలో జరిగిన జాతీయ యువజనోత్సవాలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. వివేకాదనందుడి జీవితం దేశభక్తి, ఆధ్యాత్మికత, అంకితభావాలు ఎల్లప్పుడూ స్ఫూర్తిని ఇస్తాయని అన్నారు.

Exit mobile version