NTV Telugu Site icon

BJP MP: రాహుల్ గాంధీ బంగ్లా చొరబాటుదారుల్ని ఏకం చేస్తూ.. హిందువులకు అన్యాయం చేస్తున్నాడు..

Bjp Mp Nishikant Dubey

Bjp Mp Nishikant Dubey

BJP MP: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’పై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ తన పాదయాత్ర ద్వారా బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓట్లను ఏకం చేస్తున్నారని, హిందువులకు అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఆయన యాత్రలో ముస్లింలు అందరూ పాల్గొంటున్నారని, దానికి సంబంధించిన వీడియో రుజువు తన వద్ద ఉందంటూ చెప్పారు.

Read Also: Ponguleti Srinivas Reddy : రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రభుత్వం తగు చర్యలు

రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ముర్షిదాబాద్, మల్దా, కిషన్ గంజ్, కతిహార్, పూర్నియా, పాకూర్, సాహిబ్ గంజ్, గొడ్డాలో పర్యటించారని, ఇవన్నీ బంగ్లాదేశ్ చొరబాటుదారులకు కేంద్రాలుగా ఉన్నాయని బీజేపీ ఎంపీ అన్నారు. ‘‘మీరు హిందువు కాదు, మీరు మిమ్మల్ని హిందువుగా ప్రకటించుకోవాలంటే దాన్ని స్వాగతిస్తాం. హిందువులను రక్షించండి, ముస్లింలు మీతో ఉండరు’’ అంటూ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ జనవరి 14న మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించింది. 00 లోక్‌సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ సెగ్మెంట్లు, 110 జిల్లాల్లో 6,713 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. మణిపూర్‌తో పాటు, యాత్ర నాలుగు ఈశాన్య రాష్ట్రాలలో యాత్ర సాగింది. జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మరియు మహారాష్ట్రల మీదుగా యాత్ర కొనసాగి మార్చి 20న ముంబైలో ముగుస్తుంది.