మహారాష్ట్రలోని శివసేన సీనియర్ నేత, మంత్రి గులాబ్‌రావు పాటిల్ ఆదివారం నాడు చేసిన వాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తన నియోజకవర్గంలోని ధరంగావ్‌లో రోడ్లు నటి హేమమాలిని బుగ్గల్లా ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ సందర్భంగా నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని మంత్రి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రోడ్లను నటీనటుల బుగ్గలతో పోల్చే సంప్రదాయం ఆర్జేడీ ప్రారంభించిందని ఆయన గుర్తుచేశారు. గతంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ ఈ సంప్రదాయానికి తెరతీయగా… ఇప్పుడు శివసేన కొనసాగిస్తోందని ఆరోపించారు.
Read Also: రాహుల్ గాంధీ సవాల్.. దమ్ముంటే చర్చ పెట్టండి
నటీనటులను కించపరిచేలా మాట్లాడేవారి వ్యాఖ్యలు సరికావని హేమమాలిని అభిప్రాయపడ్డారు. సాధారణ ప్రజలు ఇలాంటి కామెంట్స్ చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదని… కానీ బాధ్యత గల ప్రజాప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం మంచిది కాదని హితవు పలికారు. ఈ సందర్భంగా ‘మీ బుగ్గలపై వ్యాఖ్యలు చేసిన మంత్రి గులాబ్‌రావు పాటిల్‌ను క్షమాపణ కోరతారా?’ అని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా.. తాను అలాంటి వ్యాఖ్యలను అస్సలు పట్టించుకోనని హేమమాలిని స్పష్టం చేశారు.
