Site icon NTV Telugu

BJP MP: గుండెపోటుతో బీజేపీ ఎంపీ రాజ్‌వీర్ దిలేర్ మృతి..

Bjp Mp

Bjp Mp

BJP MP: ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ సిట్టింగ్ ఎంపీగా రాజ్‌వీర్ దిలేర్ బుధవారం గుండెపోటుతో మరణించారు. 2019 ఎన్నికల్లో హత్రాస్ నుంచి బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన ఆయను మళ్లీ 2024లో కూడా ఎన్నికల బరిలో దింపింది. ఆయన మృతితో స్థానిక కార్యకర్తలు దిగ్భ్రాంతి గురయ్యారు. దిలేర్ 2017లో ఇగ్లాస్ నుంచి ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. తర్వాత లోక్‌సభకు ఎన్నికై ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దిలేర్ మృతికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Exit mobile version