Site icon NTV Telugu

Samosas: హిమాచల్‌ప్రదేశ్‌ను వదలని సమోసా వివాదం.. సీఎంకు బీజేపీ సమోసాలు ఆర్డర్

Samosas

Samosas

హిమాచల్‌ప్రదేశ్‌ రాజకీయాలను సమోసాల వివాదం ఇంకా కుదిపేస్తోంది. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల-తూటాలు పేలుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖుకి బీజేపీ ఎమ్మెల్యే 11 సమోసాలను ఆన్‌లైన్ ఆర్డర్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది.

ఇది కూాడా చదవండి: Koti Deepotsavam Day 1 LIVE : శంఖాభిషేకం, కోటిమల్లెల అర్చన, కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వరస్వామి కల్యాణం

గత నెల (అక్టోబర్) 21న ముఖ్యమంత్రి సుఖు.. సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జరిగిన కార్యక్రమానికి ఓ హోటల్ నుంచి సమోసాలు తెప్పించారు. అయితే హోటల్ నుంచి సమోసాలు రాగానే.. వాటిని పోలీసులకు అందజేశారు. అయితే పొరపాటున తమ కొరకే సమోసాలు తెచ్చారేమోనని పోలీస్ సిబ్బంది ఆరగించారు. అయితే వేదికపైకి సమోసాలు రాకపోవడంతో ప్రముఖులు ఆకలితో ఇబ్బందిపడ్డారు. ముఖ్యమంత్రితో సహా ప్రముఖులకు ఈ ఇబ్బంది తలెత్తింది. అయితే సమోసాలు.. లోపలికి వెళ్లకుండా బయటనే సిబ్బంది తినేశారు. అయితే సమోసాలు ఎలా మిస్ అయ్యాయంటూ సీఐడీ విచారణకు ఆదేశించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో ప్రతిపక్ష బీజేపీ విమర్శలు గుప్పించింది. సమోసాల కోసం సీఐడీ విచారణకు ఆదేశించడమా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అయితే ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి ఖండించారు. ఇదంతా మీడియా సృష్టేనని కొట్టిపారేశారు.

ఇది కూాడా చదవండి: Game Changer Teaser: మైండ్ బ్లాకయ్యేలా గేమ్ ఛేంజర్ టీజర్.. చూశారా?

తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఆశిశ్‌ శర్మ.. ముఖ్యమంత్రి సుఖుకు 11 సమోసాలను ఆన్‌లైన్ ఆర్డర్ పెట్టారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడిస్తూ.. ‘‘నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలతో రాష్ట్రం అల్లాడిపోతుంటే.. సమోసాల విషయంలో సీఐడీ విచారణకు ఆదేశించించడం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రికి 11 సమోసాలు పంపాను. ఆయనకు ప్రజా సమస్యలను గుర్తుచేసేందుకే అలా చేశాను’’ అని శర్మ వెల్లడించారు. మరోవైపు శుక్రవారం రాత్రి బీజేపీ సీనియర్ నేత, హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్.. బీజేపీ శ్రేణులకు సమోసా పార్టీ ఇచ్చి ప్రభుత్వ తీరును ఎద్దేవా చేశారు.

ఇది కూాడా చదవండి: Rain Alert: అలర్ట్.. మరి కొన్ని గంటల్లో ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Exit mobile version