NTV Telugu Site icon

Ranya Rao: రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు

Ranyarao

Ranyarao

కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. మార్చి 3న బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో రూ.12 కోట్ల విలువైన బంగారంతో రన్యారావు పట్టుబడింది. ఇక రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార కాంగ్రెస్-బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టా.. అధికారులపై చర్యలు తప్పవు!

తాజాగా ఇదే యవ్వారంపై బీజాపూర్ బీజేపీ ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ యత్నాల్ స్పందిస్తూ.. రన్యారావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు పార్ట్స్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రన్యారావు ఏఏ పార్టుల్లో బంగారం దాచిందో తనకు తెలుసు అని వ్యాఖ్యానించారు. అలాగే ఈ స్మగ్లింగ్‌లో మంత్రుల ప్రమేయం ఉందని.. ఆ విషయాలన్నీ తనకు తెలుసు అని చెప్పుకొచ్చారు. శాససభ సమావేశాల్లో ఒక్కొక్కరి బండారం బయటపెడతానని తెలిపారు. తండ్రి రామచంద్రరావు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి.. స్మగ్లింగ్‌కి ఎలా సహకరిస్తారని నిలదీశారు. ఇక ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల లోపాలు కూడా కనిపిస్తున్నాయని.. వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రన్యారావు తన శరీరమంతా బంగారంతో కప్పేసిందని.. ఇంకా ఏ చోటులో దాచిందో కూడా తనకు తెలుసు అని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతి పాయింట్‌ అసెంబ్లీలో వివరిస్తానని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Prabhas : ‘ఫౌజీ’లో మరో హీరోయిన్.. ?

ఇదిలా ఉంటే ఈ బీజేపీ ఎమ్మెల్యే పాటిల్ యత్నాల్‌కు వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు వ్యతిరేకంగా కూడా గళమెత్తారు. ఆయన కుమారుడు, రాష్ట్ర యూనిట్ చీప్ విజయేంద్రపై కూడా పదే పదే విమర్శలు గుప్పించారు. ఇక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యడియూరప్పను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇక 2020లో మైనార్టీలకు వివాహ పథకాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ పథకం కావాలంటే పాకిస్థాన్ వెళ్లిపోవాలని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: IML 2025: ఫైనల్ మ్యాచ్ లో యువరాజ్ సింగ్, టినో బెస్ట్ మధ్య గొడవ.. వీడియో వైరల్