Site icon NTV Telugu

BJP Leader: మమతా బెనర్జీ మంత్రగత్తె, ఆమె తల నరకాలి.. వివాదంగా బీజేపీ నేత వ్యాఖ్యలు..

Mamata Banerjee

Mamata Banerjee

BJP Leader: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరాయి. తాజాగా, బీజేపీ సీఎం మమతా బెనర్జీపై విరుచుపడింది. బీజేపీ నాయకుడు సంజయ్ దాస్ టీఎంసీ అధినేత్రిని ఉద్దేశించి సంచనల వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బెంగాల్ మాజీ చీఫ్ దిలీప్ ఘోష్ హాజరైన ఓ కార్యక్రమంలో సంజయ్ దాస్ మాట్లాడుతూ.. ‘‘ ఈ ముసలి మంత్రగత్తె పశ్చిమ బెంగాల్‌ను పాలిస్తోంది. ఆమె తలను ఖడ్గంతో నరకాలి’’ అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.

Read Also: Mokshagna Debut: ప్రాజెక్టులు క్యాన్సిల్… డైరెక్టర్లు మార్పు.. నందమూరి వారసుడి ఎంట్రీ ఎప్పుడో మరి..?

సంజయ్ దాస్ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో బీజేపీ మథురాపూర్ యూనిట్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ వ్యాఖ్యలపై టీఎంసీ విరుచుకపడింది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మహిళా ముఖ్యమంత్రి హత్యకు బహిరంగ పిలుపుగా టీఎంసీ అభివర్ణించింది. బెంగాల్ కోరుకునే మార్పు ఇదేనా? మహిళలను బెదిరించడం, హింసను కీర్తించడం, మూకదాడి భాషను వేదికపై సాధారణీకరించడం జరుగుతోందా?? అని టీఎంసీ ప్రశ్నించింది.

Exit mobile version