BJP is leading in the 2022 Uttar Pradesh Assembly elections.
దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటిండ్ ఉదయం 8 గంటలకు మొదలైంది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌పైనే అందరి దృష్టి ఉంది. గత ఎన్నికల్లో యూపీలో సత్తా చాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఈ సారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాతో ఉంది. అందుకు అనుగుణంగా ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. యూపీలో 403 స్థానాలకు 7 విడతల్లో పోలింగ్ జరిగింది. దీంతో యూపీలోని మొత్తం 75 జిల్లా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు.
అయితే మ్యాజిక్ ఫిగర్ 202కు గాను బీజేపీ అభ్యర్థులు 212 స్థానాల్లో ఆధిక్య ప్రదర్శిస్తున్నారు. వీటితో పాటు ఎస్పీ 106 స్థానాల్లో, కాంగ్రెస్ 6 స్థానాల్లో, బీఎస్పీ 4 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అయితే లఖింపూర్ ఖేరి ప్రాంతంలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో సాగుతోంది. చూస్తుంటే ఈ సారి కూడా యూపీలో కమలనాథులు కాషాయ ప్రభుత్వం రాబోతున్నట్లు కనిపిస్తోంది.
