Site icon NTV Telugu

Chandigarh Mayor Elections: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో సంచలనం.. ఒక్క ఓటుతో బీజేపీ విజయం

Chandigarh Mayor Elections

Chandigarh Mayor Elections

BJP Defeats AAP By 1 Vote In Chandigarh Poll: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో సంచలనం నమోదు అయింది. గతంలో జరిగిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నువ్వా నేనా అన్న రీతిలో పోరాడాయి. మొత్తం మున్నిపల్ కార్పొరేషన్ లో 35 కౌర్పొరేటర్ స్థానాలు ఉన్నాయి. వీటిలో ఆప్, బీజేపీ పార్టీలకు చెరో 14 మంది కౌన్సిలర్లు ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు, శిరోమణి అకాలీదళ్ కు ఒక కార్పొరేటర్ ఉన్నారు.

Read Also: Ali vs Pawan Kalyan: ఆలీ సంచలన ప్రకటన.. పవన్‌ కల్యాణ్‌పై పోటీకి రెడీ

మంగళవారం మేయర్ ఎన్నిక కోసం జరిగిన ఎలక్షన్స్ లో బీజేపీ ఒక్క ఓటుతో గెలుపొందింది. బీజేపీ నుంచి కొత్త మేయర్ గా అనూప్ గుప్తా ఎన్నియ్యారు. అనూప్ గుప్తాకు 15 ఓట్లు రాగా.. ఆప్ మేయర్ అభ్యర్థి జస్బీర్ సింగ్ కు 14 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ పార్టీ ఒక్క ఓటుతో మేయర్ సీటును కైవసం చేసుకుంది.

ఆరుగురు సభ్యులు ఉన్న కాంగ్రెస్, ఒక కార్పొరేటర్ ఉన్న శిరోమణి అకాలీదళ్ మేయర్ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. బీజేపీ, ఆప్ లకు చెరో 14 మంది కార్పొరేటర్లు ఉండగా.. బీజేపీకి చెందిన కిరణ్ ఖేర్ చండీగఢ్ పార్లమెంట్ సభ్యుడిగా, మున్సిపల్ కార్పొరేషన్ లో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో బీజేపీకి 15 ఓట్లు వచ్చాయి. దీంతో ఒక్క ఓటుతో బీజేపీ గెలిచింది. ఈ రోజు సాయంత్రం సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.

Exit mobile version