Brij Bhushan: రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానా ఎన్నికల ముందు ఈ కీలక పరిణామం జరిగింది. వచ్చే ఎన్నికల్లో వీరి చేరిక తమ పార్టీకి బలంగా మారుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదిలా ఉంటే, వీరు కాంగ్రెస్‌లో చేరడంపై బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్పందించారు. గతంలో తనపై చేసిన లైంగిక ఆరోపణల్లో కాంగ్రెస్ కుట్ర ఉందని వ్యాఖ్యానించారు. గతంలో కూడా ఇదే విధంగా చెప్పానని అన్నారు. వీరి చేరిక తనపై కుట్రను బహిర్గతం చేసిందని చెప్పారు.
Read Also: FADA: గుడ్ న్యూస్.. దేశంలో 7.8 లక్షల కార్ల నిలువలు.. భారీగా డిస్కౌంట్లు!
అయితే, బ్రిజ్ భూషణ్‌ని ఫోగట్, పునియాల గురించి మాట్లాడటం మానుకోవాలని బీజేపీ సలహా ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్‌గా ఉన్నప్పుడు బ్రిజ్ భూషణ్‌పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఇతడికి వ్యతిరేకంగా వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ వంటి వారు ఢిల్లీలో భారీ ఆందోళనలు చేశారు. ఈ ఆందోళనకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది.
కాంగ్రెస్‌లో వీరి చేరికపై మాట్లాడిన బ్రిజ్ భూషన్.. వినేష్, బజరంగ్ రెజ్లింగ్‌తో పేరు తెచ్చుకున్నారని, దీంతోనే ఫేమస్ అయ్యారని, అయితే కాంగ్రెస్‌లో చేరిన తర్వాత వవారి పేర్లు చెరిపివేయబడుతాయని అన్నారు. వినేష్, బజరంగ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామనుకుంటే పొరపాటే, వారిని హర్యానాలో ఏ నియోజకవర్గంలోనైనా బీజేపీ అభ్యర్థి ఓడిస్తారని అన్నారు. వచ్చే నెలలో జరగబోతున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్ ఫోగట్ జులనా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పునియాని ‘‘కిసాన్ కాంగ్రెస్’’ వర్కింగ్ చైర్మన్‌గా నిమయించింది.