Manish Sisodia: బీజేపీ నిరక్షరాస్యుల పార్టీ.. దేశం కూడా అలాగే ఉండాలని కోరుకుంటోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manish Sisodia: బీజేపీ నిరక్షరాస్యుల పార్టీ అని, వారు దేశాన్ని కూడా అలాగే ఉంచాలని చూస్తున్నారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. ఇతర రాష్ట్రాల్లో మూసివేసినట్లే దేశ రాజధానిలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు అనేక ప్రైవేట్ పాఠశాలలను కూడా మించినవి ఉన్నాయన్నారు.
ఢిల్లీలో ఆప్ నేతృత్వంలోని పాలనను కూల్చివేయాలని బీజేపీ తహతహలాడుతోందని, తన నివాసంపై సీబీఐ దాడులు ఫలించలేదని, కేంద్రంలోని బీజేపీ ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లోని లోపాలను ఎత్తిచూపేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. 10 రోజుల సీబీఐ దాడులు జరిగినా ఏం తేలింది చెప్పండి.. మద్యం కుంభకోణంలో ఏమీ బయటకు రాకపోతే, పాఠశాలల నిర్మాణంలో ఉల్లంఘనలు జరిగాయని వారు (బీజేపీ) చెబుతున్నారని ఢిల్లీ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మీడియా సమావేశంలో వెల్లడించారు. “ఇవన్నీ అబద్ధం, ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా ఉన్నాయి” అని పేర్కొన్నారు. ఇది నిరక్షరాస్యుల పార్టీ అని, దేశం మొత్తాన్ని నిరక్షరాస్యులుగా ఉంచాలని చూస్తోందని, పాఠశాల అవినీతిపై వారికి ఆసక్తి లేదని బీజేపీపై ఘాటుగా దాడి చేశారు.
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
Devendra Fadnavis: కాంగ్రెస్ మునిగిపోతున్న నావ.. ఆజాద్ లేవనెత్తిన ప్రశ్నలు సరైనవే..
ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్‌కు ఆప్ చేసిన కృషిని కొనియాడుతూ, “2015 నుంచి 700 కొత్త పాఠశాల భవనాలను కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్మించింది. ఈ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడుతున్నాయి.” అని సిసోడియా పేర్కొన్నారు. ఫైళ్లపై సీఎం కేజ్రీవాల్ సంతకం లేకపోవడం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తిరిగి ఇవ్వడంపై ఆయన మాట్లాడుతూ, ఇది సాధారణ ప్రక్రియ అని అన్నారు. ‘లెఫ్టినెంట్ గవర్నర్ లాగా ప్రవర్తించండి సార్’ అని మనీష్ సిసోడియా అన్నారు
తాజావార్తలు
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..