Site icon NTV Telugu

Siddaramaiah: ఆకస్మిక మరణాలకు కోవిడ్ టీకాలే కారణం.. సీఎం వ్యాఖ్యల్ని ఖండించిన బయోకాన్ చీఫ్

Kiranmazumdarshaw

Kiranmazumdarshaw

దేశ వ్యాప్తంగా ఈ మధ్య హఠాత్తు మరణాలు సంభవిస్తున్నాయి. దీనికి కోవిడ్ వ్యాక్సినే కారణమంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. యువకులే ఎక్కువగా గుండెపోటు వచ్చి చనిపోతున్నారు. దీంతో ప్రచారం మరింత వ్యాప్తి చెందుతోంది. అంతేకాకుండా కర్ణాటకలోని హసన్ జిల్లాలో గత నెలలో గుండెపోటుతో 20 మంది చనిపోయారు. దీనికి కోవిడ్ వ్యాక్సిన్లే కారణమంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Drones in War: యుద్ధరంగంలో సరికొత్త శకం.. కీలకంగా వ్యవహరిస్తున్న డ్రోన్లు..

తాజాగా బయోకాన్ చీఫ్ కిరణ్ మంజుదార్ షా స్పందించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. హసన్ జిల్లాలో జరిగిన మరణాలు కోవిడ్ టీకాల ప్రభావం కాదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని తెలిపారు. ప్రజల్లోకి చాలా తప్పుడు సమాచారం వెళ్లిందని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ భద్రత, సమర్థవంతంగా ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించినట్లు క్లారిటీ ఇచ్చారు. ఏదో అత్యవసరంగా తొందరపడి టీకాలు రూపొందించలేదని తేల్చి చెప్పారు. లక్షలాది మంది ప్రాణాలను టీకాలు కాపాడాయని గుర్తుచేశారు. అయితే హార్ట్ ఎటాక్‌తో చనిపోతుంటే.. చాలా మంది వ్యాక్సిన్లు కారణంగానే చనిపోతున్నారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Shubman Gill: రెండో టెస్టులోనే.. ‘కింగ్’ కోహ్లీ రికార్డు సమం! గిల్ సూపరో సూపర్

జూన్ నెలలో హసన్‌ జిల్లాలో 20 మంది గుండెపోటుతో మరణించారు. అయితే ఈ చావులకు కారణమేంటో తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. పది రోజుల్లో నివేదిక సమర్పించాలని సిద్ధరామయ్య ఆదేశించారు. కోవిడ్‌ వ్యాక్సిన్లను ప్రజలకు తొందరపాటుగా ఆమోదించడం, పంపిణీ చేయడం కూడా మరణాలకు కారణం కావొచ్చని సిద్ధరామయ్య అనుమానం వ్యక్తంచేశారు. వ్యాక్సిన్లతో గుండెపోటు పెరుగుదలకు కారణమవుతాయని వెల్లడించాయన్నారు. దీనిపై కూడా సమగ్ర అధ్యయనం చేయాలని కమిటీని ఆదేశించినట్లు తెలిపారు.

ఇక ఆకస్మిక మరణాలకు ఆరోగ్య సమస్యలే కారణం తప్ప, కోవిడ్ వ్యాక్సిన్‌ కాదని బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కూడా స్పష్టంచేసింది. ఐసీఎంఆర్‌, ఢిల్లీ ఎయిమ్స్‌ నిర్వహించిన అధ్యయనాల్లో ఈ విషయం తేలిందని పేర్కొంది. కోవిడ్‌ వ్యాక్సిన్లు సురక్షితంగా, సమర్థంగా పనిచేస్తున్నాయని, తీవ్ర దుష్పరిణామాలు సంభవించిన ఉదంతాలు అత్యంత అరుదుగా కనిపించాయని వెల్లడించాయి.

 

Exit mobile version