Site icon NTV Telugu

Mumbai: ఒకే బెంచ్‌పై కూర్చుని వడ పావ్ ఆస్వాదించిన బిల్‌గేట్స్-సచిన్

Mumbai

Mumbai

మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్‌గేట్స్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఇటీవల పార్లమెంట్ భవన్‌ను సందర్శించారు. అనంతరం ఏపీ ప్రభుత్వంతో పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. తాజాగా సచిన్ టెండూల్కర్‌తో ఉన్న ఒక వీడియోను బిల్‌గేట్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్నిప్రమాదం.. బయటపడ్డ పెద్ద ఎత్తున నోట్ల కట్టలు.. షాకైన అధికారులు

ఒకే బెంచ్‌పై కూర్చుని సచిన్ టెండూల్కర్‌తో కలిసి బిల్‌గేట్స్ వడ పావ్ ఆస్వాదించారు. ఈ వీడియోను బిల్‌గేట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. పనికి వెళ్లే ముందు స్నాక్ బ్రేక్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. భారత్‌లో ప్రతిష్టాత్మక వ్యక్తులతో నిండి ఉంది కాబట్టే తాను కొత్త ఆలోచనలతో భారత్‌లో పర్యటిస్తున్నట్లు బిల్‌గేట్స్ రాసుకొచ్చారు. మూడేళ్లలో బిల్‌గేట్స్‌కి ఇది భారత్‌లో మూడో పర్యటన. పర్యటనలో భాగంగా కేంద్ర పెద్దలతో సమావేశమై.. కీలక అంశాలపై చర్చించారు.

ఇది కూడా చదవండి: IPL 2025 Predictions: మాజీ క్రికెటర్ల ప్లేఆఫ్స్ ప్రిడక్షన్స్.. సన్‌రైజర్స్‌కు ఏకంగా 8 మంది మద్దతు!

ఇక 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ఏకైక ఘనత సచిన్ టెండూల్కర్‌ది. టెస్ట్, వన్డే ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ కూడా సచిన్ సొంతం. 1989 నుంచి 2013 వరకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించాడు. మహారాష్ట్రలో జన్మించిన సచిన్.. నవంబర్ 15, 1989న కేవలం 16 సంవత్సరాల వయసులో టెస్ట్ అరంగేట్రం చేశారు. అదే సంవత్సరం డిసెంబర్ 18న తన తొలి వన్డే ఆడాడు. 664 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 48.52 సగటుతో మొత్తం 34,357 పరుగులు చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచారు. 100 సెంచరీలు, 164 హాఫ్ సెంచరీలు క్రీడా చరిత్రలో సాటిలేనివి.

Exit mobile version