బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ లిస్ట్‌పై తీవ్ర రగడ నడుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సర్వేపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఎన్నికల సంఘం సర్వే చేపట్టిందంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తు్న్నాయి. అటు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ.. ఇటు బీహార్ అసెంబ్లీలోనూ తీవ్ర రగడ నడుస్తోంది. తక్షణమే సర్వే నిలిపివేయాలంటూ ఆందోళన నిర్వహిస్తున్నాయి. అయితే నకిలీ ఓట్లను మాత్రమే తొలగిస్తున్నట్లు ఈసీ చెప్పుకొస్తోంది.
ఇది కూడా చదవండి: Paritala Sunitha: సూట్ కేసు రెడీ చేసుకో…. త్వరలో జైలుకే..!
ఇదిలా ఉంటే శుక్రవారం సాయంత్రం బీహార్ ఓటర్ జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. గతంలో సుమారు 8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం 7 కోట్లు 35 లక్షల ఓటర్లుగా ఉన్నట్లు నిర్ధారించారు. ఇక అభ్యంతరాలు, ఫిర్యాదుల పర్వం పూర్తయిన తర్వాత సెప్టెంబరు 30న తుది జాబితా విడుదల చేయనుంది. సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఫిర్యాదులు, అభ్యంతరాలతో పాటు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట..
ఇదిలా ఉంటే బీహార్ ఓటర్ల జాబితాపై పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళనలు, వాయిదాల పర్వం కొనసాగుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం నుంచి ఇండియా కూటమి పార్లమెంట్ వెలుపల, లోపల ఆందోళనలు, నిరసనలు చేపడుతోంది. ఇక అంతా సవ్యంగానే ‘ఎస్ఐఆర్’ (ప్రత్యేక పునఃపరిశీలన) కసరత్తు జరుగుతోందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. జాబితాలో 65 లక్షల ఓటర్లు పేర్లు గల్లంతయ్యాయన్న ఆరోపణలో వాస్తవం లేదని పేర్కొంది. చాలా మంది మృతి చెందారని, రెండు చోట్ల నమోదు చేసుకున్నారని, శాశ్వతంగా రాష్ట్రం నుంచి వెళ్ళి పోయారని, సరైన సాక్ష్యాధారాలు, పత్రాలు లేని పేర్లు తొలగించినట్లు ఈసీ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Uttarakhand: 5 ఆస్పత్రుల నిర్లక్ష్యం.. ఏడాది బాలుడు మృతి.. ముఖ్యమంత్రి ఆగ్రహం
