Site icon NTV Telugu

Student Marries Teacher: టీచర్‌ని పెళ్లి చేసుకున్న స్టూడెంట్.. రక్షణ కోరుతూ వీడియో..

Bihar

Bihar

Student Marries Teacher: బీహార్‌లో ఓ విద్యార్థిని, తనకు చదువులు చెప్పిన టీచర్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లిని విద్యార్థిని కుటుంబం ఒప్పుకోకపోవడంతో, తమకు రక్షణ కావాలంటూ ఓ వీడియోలో వేడుకున్నారు. వీడియోలో విద్యార్థిని తనకు 18 ఏళ్లు నిండాయని, తన ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది.

Read Also: UGC: 54 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను డిఫాల్టర్లుగా ప్రకటించిన UGC.. లిస్ట్ ఇదిగో

ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని సింధూ కుమారి బీహార్ లని జముయ్ జిల్లాలోని ఒక కోచింగ్ సెంటర్‌లో చదువుకుంటోంది. తనకు చదవు చెబుతున్న టీచర్ ప్రభాకర్ మహాతో తో ప్రేమలో పడింది. కుమారి ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతోంది. ప్రభాకర్ మహతో ఒక పోలీస్ అధికారి, ఆరు నెలల క్రితమే ఉద్యోగంలో చేరాడు. వారు కోచింగ్ సెంటర్‌లో ముందుగా స్నేహితులుగా మారారు. ఆ తర్వాత ప్రేమించుకున్నారు.

అయితే, కుమారి రిలేషన్ గురించి తెలుసుకున్న ఆమె కుటుంబం ఇద్దరి వివాహానికి నిరాకరించింది. లఖిసరాయ్ జిల్లాలోని మహతో కుటుంబం కూడా ఈ సంబంధాన్ని వ్యతిరేకించింది. ఇరు కుటుంబాలు అంగీకరించనప్పటికీ, ఇద్దరు కలిసి పారిపోయి గుడిలో వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లి తర్వాత తమ కుటుంబాల నుంచి మప్పు ఉందని, తమకు హాని కలుగజేస్తారని భయపడుతున్నట్లు వీడియోలో కుమారి చెప్పింది. మహతో తో తన ఇష్టప్రకారమే పెళ్లి జరిగిందని చెప్పుకొచ్చింది. తమను వేధించవద్దని వీడియోల కోరారు. ఈ విషయాన్ని తాము పరిశీలిస్తున్నామని జముయు పోలీస్ అధికారి చెప్పారు. ఇరు కుటుంబాలతో మాట్లాడుతామని చెప్పారు.

Exit mobile version