Bihar Election 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడతలో రికార్డ్ స్థాయి పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 64.46 శాతం నమోదైనట్లు, మరికొన్ని స్థానాల్లో ఇంకా ఓటింగ్ జరుగుతున్నట్లు బీహార్ ముఖ్య ఎన్నికల అధికారి వినోద్ గుంజ్యాల్ చెప్పారు. 73 ఏళ్ల బీహార్ ఎన్నికల చరిత్రలో ఇదే హైయెస్ట్. 2020లో జరిగిన ఎన్నికల్లో మొదటిదశలో నమోదైన దాని కన్నా ఎక్కువ నమోదైంది. 57 శాతం నమోదైంది. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2025 ఎన్నికల తొలి విడతలో 121 నియోజకవర్గాలకు ఓటింగ్ జరిగింది. రెండో విడత నవంబర్ 11న జరగనుంది. ఫలితాలు నవంబర్ 14న వెల్లడవుతాయి.
Read Also: llegal Betting App Case: సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లకు ఈడీ షాక్.. రూ.11 కోట్ల ఆస్తులు జప్తు
2010లో బీజేపీ+జేడీయూ కలసి పోటీ చేసిన సందర్భంలో ఘన విజయం సాధించాయి. ఆ సమయంలో 52.73 శాతం ఓటింగ్ నమోదైంది. 2015లో జేడీయూ+ఆర్జేడీ కలిసి పోటీ చేసిన సందర్భంలో 56.19 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ సమయంలో ఈ కూటమి విజయం సాధించింది. 2020లో జేడీయూ+బీజేపీ కలిసి పోటీ చేసి గెలుపొందాయి. అప్పుడు 57.29 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రస్తుతం, 2025లో మొదటిదశలో 64 శాతం కన్నా ఎక్కువ ఓటింగ్ నమోదైంది. ఈసారి కూడా జేడీయూ+బీజేపీలు కలిసి పోటీ చేస్తున్నాయి.
‘‘ఈ రోజు జరిగిన మొదటి దశలో, ఎన్నికల సంఘం 45,341 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 41,943 బూత్‌ల డేటా వచ్చింది. ఓటింగ్ శాతం 64.46గా ఉంది. మిగతా డేటా వచ్చిన తర్వాత ఫైనల్ ఓటింగ్ శాతం అప్డేట్ చేస్తాం. ’’ అని బీహార్ ప్రధాన ఎన్నికల అధికారి వినోద్ సింగ్ గుంజ్యాల్ చెప్పారు.
