బీహార్‌లో కులాల వారీగా జనగణన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపై అక్కడి ప్రభుత్వంలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీహార్‌లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింలను కూడా లెక్కించాలని మంత్రి నీరజ్ కుమార్ సింగ్ బబ్లూ తాజాగా డిమాండ్ చేశారు. ముస్లిం కమ్యూనిటీకి చెందిన కొందరికి ముగ్గురు భార్యలు, 15-20 మంది వరకు పిల్లలు ఉన్నారని.. వారు జనాభా లెక్కల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. జనాభా లెక్కల్లోకి రాకూడదన్నది వారి ఆలోచన అని.. మైనారిటీలను కూడా లెక్కల్లోకి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
Central Government: కేంద్రం మరో కీలక నిర్ణయం.. త్వరలో పీఎంశ్రీ స్కూల్స్
గడిచిన కొన్ని సంవత్సరాల్లో బీహార్ లో ముస్లింల జనాభా చాలా వేగంగా పెరిగినట్టు వివరించారు. మైనారిటీ జనాభా ఎంత వేగంగా పెరిగిందో కులాల వారీ జనగణనతో తేలిపోతుందన్నారు. బీహార్‌లో జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. బీహార్ ప్రభుత్వం రోడ్డు విస్తరణ, కొత్త పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణం వంటి పనులను చేపడుతోందని, అయితే పెరుగుతున్న జనాభా కారణంగా అవి సరిపోవడం లేదని రుజువైందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనుషుల మధ్య కొట్లాటలు తప్పవని, అందుకే బీహార్‌లో జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదే సమయంలో జనగణనలో భాగంగా రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింలను జనగణనలో లెక్కించకూడదని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. దీంతో గందరగోళం ఏర్పడింది.