Site icon NTV Telugu

Bihar Elections: వచ్చే వారమే బీహార్ ఎన్నికల షెడ్యూల్! ఈసీ కసరత్తు

Bihar Elections

Bihar Elections

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల అధికారులు శని, ఆదివారాల్లో బీహార్‌లో పర్యటిస్తున్నారు. ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్లు వివేక్‌ జోషి, ఎస్‌ఎస్‌ సంధు రెండ్రోజుల పాటు పాట్నాలో పర్యటించనున్నారు. ఎన్నికల సన్నద్ధతపై ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఈ పర్యటన తర్వాత వచ్చే వారం ఏదో సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు వర్గాలు పేర్కొన్నాయి.

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ గడువు 2025 నవంబర్ 22తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలాఖరు నాటికి లేదా నవంబర్‌ ప్రారంభంలోనైనా ఎన్నికలు ముగించాలని భావిస్తోంది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా 3 దశల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కసరత్తు చేస్తోంది.

ఇది కూడా చదవండి: Trump: హమాస్‌కు ట్రంప్ కొత్త డెడ్‌లైన్.. లేదంటే ఆదివారం నరకం చూస్తారని హెచ్చరిక

ఇదిలా ఉంటే ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ.. అధికారం కోసం ఇండియా కూటమి ప్రయత్నిస్తోంది. అలాగే ప్రశాంత్ కిషోర్ కూడా తన సత్తా చాటుకోవాలని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Off The Record: ప్రకాశం టీడీపీలో అన్నదమ్ముల కోల్డ్ వార్!

Exit mobile version