బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.
నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే దశలో కాకుండా.. రెండు, మూడు దశల్లో బీహార్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఎన్నికల షెడ్యూల్‌ను అక్టోబర్‌లో ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ మొదటి వారం లేదా రెండవ వారం ప్రారంభంలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించవచ్చని తెలుస్తోంది. అక్టోబర్ 2న దసరా పండుగ ఉంది. ఆ పండుగ అవ్వగానే షెడ్యూల్ విడుదల చేసే ఛాన్సుంది.
ఇది కూడా చదవండి: UP: భార్యాభర్తల మధ్య ఘర్షణ.. బిల్డింగ్‌పైకి ఎక్కి భార్య ఏం చేసిందంటే..!
ఇక ఛత్ పూజ అనేది బీహార్‌లో జరిగే అతి పెద్ద పండుగ. ఈ పండుగ అక్టోబర్‌లో జరగనుంది. ఈ పండుగ ముగియగానే నవంబర్‌లో ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ భావిస్తోంది. ఆ విధంగానే ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ ఖరారు చేస్తోంది. నవంబర్‌లో రెండు, మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనుంది.
ఇది కూడా చదవండి: Ghaati Pre Review: అనుష్క చేయబోయే ఊచకోతకు గూస్‌బంప్స్ గ్యారెంటీ.. రేపు ఊచకోతే?
ఇక బీహార్‌లో ఎన్నికల సంఘంస్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) చేపట్టింది. ఇప్పటికే తీసివేతలు, కూడికలు చేస్తోంది. ఇదంతా పూర్తయ్యాక తుది జాబితాను ఈ నెలాఖరులోగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తానికి దసరా పండుగ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా తెలుస్తోంది.
నవంబర్ 22 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ 15-20 మధ్యలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయొచ్చు. మొత్తానికి రెండు నెలల్లో మాత్రం బీహార్ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుత బీహార్ అసెంబ్లీలో 243 మంది సభ్యులున్నారు. ఎన్డీఏలో 131 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీకి 80 మంది ఎమ్మెల్యేలు, జేడీయూ-45, హెచ్ఏఎం(ఎస్)-4, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ప్రభుత్వం నడుస్తోంది. ఇండియా కూటమికి 111 మంది సభ్యుల బలం ఉంది. ఆర్జేడీ 77 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. కాంగ్రెస్-19, సీపీఐ(ఎంఎల్)-11, సీపీఐ(ఎం)-2, సీపీఐ-2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈసారి ఎలాగైనా అధికారం ఛేజిక్కించుకోవాలని విపక్ష కూటమి భావిస్తోంది. అలాగే మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార కూటమి వ్యూహం రచిస్తోంది. బీహారీయులు ఈసారి ఏ కూటమికి అధికారం కట్టబెట్టనున్నారో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
