NTV Telugu Site icon

Bihar: ఎగ్జామ్‌లో కాపీయింగ్ వివాదం.. కాల్పుల్లో విద్యార్థి మృతి..

Biha

Biha

Bihar: బీహార్‌లోని రోహ్తాస్ జిల్లాలో మెట్రిక్యులేషన్ పరీక్షలో కాపీయింగ్ చేశారనే ఆరోపణలు రెండు గ్రూపుల విద్యార్థుల మధ్య ఘర్షణకు కారణమైంది. ఈ గొడవల్లో 10వ తరగతి విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. బుధవారం ఇరు వర్గాలు భౌతిక ఘర్షణకు దిగాయి. మరుసటి రోజు ఈ వివాదం తీవ్రమైంది, ఆ సమయంలోనే కాల్పులు జరిగాయి. ఒకరు మరణించగా, మరోక విద్యార్థి కాలికి, మరొక విద్యార్థి వీపుకు గాయమైంది. స్థానిక పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: India On USAID: ‘‘భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం’’.. ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం స్పందన..

ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న నారాయణ్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రికి తరలించారు. హత్యకు గురైన బాలుడి కుటుంబీకులు, గ్రామస్తులు న్యాయం కోసం రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అధికారులు న్యాయం చేస్తామనే హామీ ఇచ్చి, వారిని వెనక్కి పంపారు.