బీహార్‌లో ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇక అన్ని పార్టీలు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక ఎన్నికల సమయం అంటే.. అన్ని వర్గాల ప్రజలను కలుస్తుంటారు. వారి ఆచారాలను గౌరవిస్తుంటారు. మిగతా సమయాల్లో ఎలాగున్నా.. ఎన్నికల సమయంలో మాత్రం ఇష్టంలేకపోయినా ఓటర్లను ఆకట్టుకునేందుకు పద్ధతులను పాటిస్తుంటారు. కానీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం మదర్సా కార్యక్రమంలో పాల్గొని వారి ఆచారాలను పాటించేందుకు నిరాకరించారు. నితీష్ కుమార్ తలపై ముస్లిం నాయకులు టీపీ పెట్టేందుకు ప్రయత్నించగా నిరాకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Donald Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ అల్టిమేటం… రెండు వారాల్లో శాంతి చర్చలు.. లేకపోతే?
గురువారం రాష్ట్ర మదర్సా బోర్డు శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నితీష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు, పెద్దలు ముఖ్యమంత్రి తలపై టోపీ పెట్టేందుకు ప్రయత్నించారు. కానీ అందుకు ఆయన నిరాకరించారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే తాజాగా ఈ పరిణామం 13 ఏళ్ల క్రితం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. దేశాన్ని నడపాలంటే టోపీ, తిలకం రెండూ ధరించాలని ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని మోడీని ఉద్దేశించి నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు. తాజాగా టోపీ నిరాకరించడంతో నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Tollywood : చర్చలు సఫలం.. రేపటి నుంచి షూటింగులు ప్రారంభం
ఈ పరిణామంపై జేడీయూ ఎమ్మెల్సీ ఖలీద్ అన్వర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీరును సమర్థించారు. మంత్రి జామా ఖాన్ తలపై టోపీ పెట్టి మైనారిటీ సమాజ గౌరవాన్ని పెంచారని తెలిపారు. నితీష్ కుమార్ బీహార్ ముస్లింల హక్కుల కోసం ఎల్లప్పుడూ కృషి చేశారని.. ఎల్లప్పుడూ లౌకిక భావజాలాన్ని అనుసరిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్జేడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారరు. ఆర్జేడీ రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో నితీష్ కుమార్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం మైనార్టీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. 2005కు ముందు ముస్లింలకు ఏదైనా మంచి పని జరిగిందా? అని ప్రశ్నించారు. ముస్లింల కోసం ఏ ఒక్క మంచి పని చేయలేదన్నారు. తమ ప్రభుత్వం మదర్సా ఉపాధ్యాయులకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులతో సమానంగా వేతనాలు ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే ముస్లిం మహిళల హక్కుల కోసం కూడా పని చేసినట్లు పేర్కొన్నారు.
मदरसा बोर्ड के शताब्दी समारोह में सबको सौगात,
मुस्लिम समाज के लिए काम गिनाए हज़ार,मंच पर नारे – 2025 में फिर से नीतीश
“विकास की बातें बहुत,
टोपी पहनने में हिचकिचाहट! नीतीश बाबूटोपी पर दिखी उनकी अजीब सी खीझ!"#Bihar #NitishKumar #Madrasa pic.twitter.com/0uaYU7HAtk
— Arvind_kumar (@Arvinds28250877) August 21, 2025
