NTV Telugu Site icon

Bihar: బీహార్ బాలికను కిడ్నాప్ చేసి, బలవంతంగా విసిరేశాడు.. చివరికి..

Biharr

Biharr

మహిళల రక్షణ కోసం ఎన్నో రకాల కొత్త కఠిన శిక్షలను ప్రభుత్వం తీసుకు వచ్చినా కూడా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. అత్యాచారాలు, హత్యలు, మోసాలు వారిని ఏదోక రకంగా వేదిస్తున్నారు.. కామ కోరికల కోసం కంటికి కనిపించిన ఆడ పిల్లను అపరిహరించి అతి దారుణంగా లైంగిక దాడి చేసి, చివరికి అత్యంత పాసవికంగా చంపేస్తున్నారు.. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుతున్నాయి.. తాజాగా మరో బాలిక ను అపహారించే ప్రయత్నం చేశారు.. కానీ చివరికి గ్రామస్తులకు దొరకడంతో దేహశుద్ధి చేశారు.. ఈ ఘటన బీహార్ లో వెలుగు చూసింది..

ఇద్దరు వ్యక్తులు 15 ఏళ్ల బాలికను ఆటోలో అపహరించారు. ఆమె కేకలు వేయడంతో వారు ఆమెను కదులుతున్న వాహనం నుండి బయటకు విసిరారు, అయితే స్థానిక నివాసితులు వారిని వెంబడించి డ్రైవర్‌ను పట్టుకున్నారని పోలీసులు ఆదివారం తెలిపారు. బాలికకు తీవ్ర గాయాలు కాగా, అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను మగద్ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. గయా జిల్లాలో ని టంకుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని గయా-రాజౌలి రహదారి పై ఈ ఘటన జరిగింది..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్తర బజార్ ప్రాంతంలో ఇద్దరు యువకులు బాలికను బలవంతంగా ఆటో  లో కూర్చోబెట్టి పారిపోవడం ప్రారంభించారు. ఆమె సహాయం కోసం కేకలు వేయడం తో స్థానికులు ఆటోను వెంబడించడం ప్రారంభించారు..ఇక పారిపోలేమన్న భయం తో నిందితులిద్దరూ బాలికను ఆటోలో నుంచి తోసేసి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే స్థానికులు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆటోడ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు నిందితులను గుర్తించామని, వారి కోసం గాలిస్తున్నామని, బాలిక స్పృహలో కి వచ్చాక వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.. ప్రస్తుతం బాలిక పరిస్థితి బాగానే ఉందని తెలిపారు..  ఈ ఘటన పై స్థానికులు వెంటనే స్పందించి మంచి చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియల్సి ఉన్నాయి..