Bihar: AK-47 ఘటనపై నిరసన.. పోలీసుల అదుపులో తేజస్వీ యాదవ్..

  • బీహార్‌లో తీవ్ర ఉద్రిక్తత..
  • ఆర్జేడీ లోక్‌భవన్ మార్చ్..
  • పోలీసుల అదుపులో తేజస్వి యాదవ్..
Bihar

Bihar

Bihar: బీహార్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాట్నాలో ఆర్జేడీ నిర్వహించిన రాజ్‌భవన్ మార్చ్ వివాదంగా మారింది. ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సివాన్ జిల్లాలో గత నెలలో విద్యార్థలు నిరసనలపైకి ఏకే-47తో కానిస్టేబుల్ కాల్పులు జరిపిన ఘటనకు నిరసనగా ఆర్జేడీ ఈ మార్చ్ చేపట్టింది. జేపీ గోల్‌అంబర్ వద్ద ఆర్జేడీ కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు సమావేశమై రాజ్‌భవన్ వైపు మార్చ్‌గా బయలుదేరారు. పోలీసులు వాటర్ కేనన్లతో మార్చ్‌ను అడ్డుకున్నారు. బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి ఆదేశాలతోనే పోలీసులు ఈ చర్యలు చేపట్టారని ఆరోపించారు. ప్రజలు మేల్కొన్నారని, ఇలాంటి చర్యలతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు.

ఆర్జేడీ ఎంపీ మీసా భారతి కూడా తేజస్వి పాదయాత్రలో పాల్గొన్నారు. పేపర్ లీక్‌లు, నిరుద్యోగం, విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె ప్రస్తావించారు. విద్యార్థులపైకి ఏకే-47తో కాల్పులు జరిపినట్లు బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అంగీకరించిందని మీసా భారతి అన్నారు. AK-47 ఉపయోగించేందుకు ఎవరు అనుమతిచ్చారో కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఆమె డిమాండ్ చేశారు.

జూలై 25న నీట్ ప్రశ్నాపత్ర లీక్‌కు వ్యతిరేకంగా సివాన్‌లో విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఆ సమయంలో కానిస్టేబు్ ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు జరిపిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. జిల్లా ఎస్పీపై బదిలీ వేటు వేశారు. కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని కానిస్టేబుల్‌ను చుట్టుముట్టిన తర్వాతే కాల్పులు జరిపినట్లు ప్రభుత్వం సుప్రీంకోర్టులో చెప్పింది.