Bihar: AK-47 ఘటనపై నిరసన.. పోలీసుల అదుపులో తేజస్వీ యాదవ్..
- బీహార్‌లో తీవ్ర ఉద్రిక్తత..
- ఆర్జేడీ లోక్‌భవన్ మార్చ్..
- పోలీసుల అదుపులో తేజస్వి యాదవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: బీహార్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాట్నాలో ఆర్జేడీ నిర్వహించిన రాజ్‌భవన్ మార్చ్ వివాదంగా మారింది. ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సివాన్ జిల్లాలో గత నెలలో విద్యార్థలు నిరసనలపైకి ఏకే-47తో కానిస్టేబుల్ కాల్పులు జరిపిన ఘటనకు నిరసనగా ఆర్జేడీ ఈ మార్చ్ చేపట్టింది. జేపీ గోల్‌అంబర్ వద్ద ఆర్జేడీ కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు సమావేశమై రాజ్‌భవన్ వైపు మార్చ్‌గా బయలుదేరారు. పోలీసులు వాటర్ కేనన్లతో మార్చ్‌ను అడ్డుకున్నారు. బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి ఆదేశాలతోనే పోలీసులు ఈ చర్యలు చేపట్టారని ఆరోపించారు. ప్రజలు మేల్కొన్నారని, ఇలాంటి చర్యలతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు.
ఆర్జేడీ ఎంపీ మీసా భారతి కూడా తేజస్వి పాదయాత్రలో పాల్గొన్నారు. పేపర్ లీక్‌లు, నిరుద్యోగం, విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె ప్రస్తావించారు. విద్యార్థులపైకి ఏకే-47తో కాల్పులు జరిపినట్లు బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అంగీకరించిందని మీసా భారతి అన్నారు. AK-47 ఉపయోగించేందుకు ఎవరు అనుమతిచ్చారో కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఆమె డిమాండ్ చేశారు.
Also Read
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
జూలై 25న నీట్ ప్రశ్నాపత్ర లీక్‌కు వ్యతిరేకంగా సివాన్‌లో విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఆ సమయంలో కానిస్టేబు్ ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు జరిపిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. జిల్లా ఎస్పీపై బదిలీ వేటు వేశారు. కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని కానిస్టేబుల్‌ను చుట్టుముట్టిన తర్వాతే కాల్పులు జరిపినట్లు ప్రభుత్వం సుప్రీంకోర్టులో చెప్పింది.
తాజావార్తలు
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు