NTV Telugu Site icon

Haryana Elections: హర్యానా ఎన్నికల ముందు బీజేపీ పాత మిత్రుడికి షాక్.. జేజేపీకి కీలక నేతలు గుడ్ బై..

Jjp

Jjp

Haryana Elections: హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 01న ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, ఈ సారి కూడా అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తుంటే, బీజేపీకి అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదిలా ఉంటే ఆ రాష్ట్రంలో కీలక పార్టీగా ఉన్న దుష్యంత్ చౌతాలకు చెందిన జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) విడిగా సత్తా చాటాలని భావిస్తోంది. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత జేజేపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ రెండు పార్టీల మధ్య పొత్తలో విభేదాలు వచ్చాయి.

Read Also: Bengaluru Techie Missing: ‘‘మీరు జైలులో పెట్టినా మంచిదే, నా భార్య వద్దకు మాత్రం వెళ్లను’’..

ఇదిలా ఉంటే, ఎన్నికల ముందు జేజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు పార్టీకి రాజీనామా చేశారు. జేజేపీని వీడిన ఎమ్మెల్యేల్లో ఈశ్వర్ సింగ్, రామ్‌కరణ్ కాలా, అనూప్ ధనక్, దేవేంద్ర బబ్లీ ఉన్నారు. అయితే , వీరు బీజేపీ లేదా కాంగ్రెస్‌లోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రామ్‌నివాస్ సుర్జాఖేరా, జోగి రామ్ సిహాగ్‌లపై అనర్హత వేటు వేయాలని దుష్యంత్ చౌతాలా కోరారు. లోక్‌సభ ఎన్నికల్లో వీరిద్దరు బీజేపీకి మద్దతాగా పనిచేశారు. మరో ఎమ్మెల్యే రాంకుమార్ గౌరమ్ కూడా పార్టీని వ్యతిరేకిస్తున్నాడు. ప్రస్తుతం పార్టీలో దుష్యంత్ సింగ్ చౌతాలాతో పాటు అతడి తల్లి నైనా చౌతాలా, అమర్ జిత్ ధండాలు మాత్రమే విధేయులుగా మిగిలారు.