NTV Telugu Site icon

PM Modi Big Gifts For Bihar: త్వరలో ఎన్నికలు జరగనున్న బిహార్కు బడ్జెట్లో వరాల జల్లు..

Bihar

Bihar

PM Modi Big Gifts For Bihar: ప్రస్తుత బడ్జెట్‌లో ఎన్డీయే మిత్రపక్ష రాష్ట్రమైన బీహార్‌కు నరేంద్ర మోడీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. రాష్ట్రంలో మఖానా బోర్డు ఏర్పాటుతో పాటు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులను సైతం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. మఖానా ఉత్పత్తిని ప్రోత్సహించి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికే రాష్ట్రంలో ప్రత్యేక మఖానా బోర్డును ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొనింది. అంతేకాదు మఖానా పండించే రైతులకు సాంకేతిక, ఆర్థిక సాయం కూడా అందించనున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ నిర్ణయంతో రైతుల ఆదాయం భారీగా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Read Also: Kriti Sanon : ఐరన్ లేడీతో జతకడుతూ బిగ్ రిస్కే చేస్తున్న ధనుష్..

అయితే, బీహార్ రాష్ట్రంలోని రైతులు చాలా కాలంగా మఖానాను పండిస్తున్నారు. దీని ఉత్పత్తిలో బీహార్ దేశంలోనే అతి పెద్ద కేంద్రంగా కొనసాగుతుంది. దేశంలో 90 శాతం మఖానా కేవలం బీహార్‌లోనే ఉత్పత్తి చేస్తున్నారు. నార్త్ బీహార్ ప్రాంతంలో అధికంగా ఈ మఖనాను పండిస్తారు. కానీ, దీన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో మఖానా పరిశ్రమకు మరింత ఊతమిచ్చినట్లైంది. అలాగే, రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో పాటు ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌ గిఫ్ట్‌ ఇచ్చిందంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.