NTV Telugu Site icon

అగ్నిప్రమాదంలో చిక్కుకున్న గ్రామం.. రూ.9 కోట్ల ఆస్తి నష్టం

దేశంలో ఈశాన్య రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కులు జిల్లా సైంజ్ వ్యాలీలో ఉన్న మజ్‌హన్‌ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడడంతో పక్కపక్కనే ఉన్న 26 ఇళ్లతో పాటు రెండు దేవాలయాలు, 26 పశువుల కొట్టాలకు కూడా మంటలు వ్యాప్తి చెందాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు.

Read Also: సౌదీ అరేబియా కీలక నిర్ణయం.. వారిపై నిషేధం

అయితే ఈ గ్రామానికి వెళ్లే రోడ్లు సరిగ్గా లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది లేటుగా చేరుకోవడంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ గ్రామంలో చాలా ఇళ్ల నిర్మాణంలో కలపను వినియోగించడంతో మంటలు చాలా వేగంగా వ్యాపించాయని స్థానికులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం రూ.9 కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై స్పందించిన హిమాచల్‌ప్రదేశ్ సీఉం జైరామ్ ఠాకూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.