NTV Telugu Site icon

Khalistan: దెబ్బ అదుర్స్.. 19 మంది ఖలిస్తాన్ ఉగ్రవాదుల ఆస్తులు స్వాధీనం..

Khalistan

Khalistan

Khalistan: కెనడా, పాకిస్తాన్, యూకే, అమెరికాల్లో ఉంటూ ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడమే కాకుండా, పంజాబ్ రాష్ట్రంలో నేరాలకు పాల్పడుతున్న ఖలిస్తానీ ఉగ్రవాదుల అణిచివేత ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. కెనడా-ఇండియాల మధ్య ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య దౌత్య వివాదానికి కారణమైంది, ఇదే సమయంలో దేశం నుంచి పారిపోయిన ఖలిస్తానీ ఉగ్రవాదులు, వేర్పాటువాదులపై భారత ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది.

ఇప్పటికే యూఎస్ఏలో ఉంటున్న ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ కు సంబంధించి పంజాబ్ లో ఉన్న అతడి ఆస్తులను కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) స్వాధీనం చేసుకుంది. ఇది జరిగిన ఒక రోజు తర్వాత అంటే ఈ రోజు ఎన్ఐఏ యూకే, అమెరికా, కెనడా, దుబాయ్ లో ఉంటున్న 19 మంది ఖలిస్తానీ ఉగ్రవాదుల జాబితాను సిద్ధం చేసింది. భద్రతా సంస్థలు వీరిని ఏళ్ల తరబడి వెంబడిస్తూ ఉన్నాయి. వీరిపై కఠినమైన యూఏపీఏ చట్టం కింద చర్యలు తీసుకుంటోంది.

Read Also: PM Modi: “ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్” ప్రపంచ వాణిజ్యానికి కీలకం..

ఉగ్రవాదుల లిస్టులో యూకేలో తలదాచుకుంటున్న పరంజీత్ సింగ్ పన్నూ, యూకేల ఉంటున్న కుల్వంత్ సింగ్ ముత్రా, సుఖ్‌పాల్ సింగ్, సరబ్జీత్ సింగ్ బెన్నూర్, కల్వంత్ సింగ్, గురుప్రీత్ సింగ్ అలియాస్ బాఘీ, దుపిందర్ జీత్, పాకిస్తాన్ లో ఉంటున్న వాధ్వా సింగ్ బబ్బర్ అలియా చాలా, అమెరికాలో ఉంటున్న జే ధాలివాల్, హర్ ప్రీత్ సింగ్ అలియాస్ రాణాసింగ్, హర్జాప్ సింగ్ అలియాస్ జప్పీ సింగ్, అమర్ దీప్ సింగ్ పూరేవాలా, హిమ్మత్ సింగ్, పాకిస్తాన్ లో ఉంటున్న రంజిత్ సింగ్ నీతా, గుర్మీత్ సింగ్ అలియాస్ బగ్గా, దుబాయ్ లో ఉంటున్న జస్మిత్ సింగ్ హాకీమ్ జాదా, ఆస్ట్రేలియాలో ఉంటున్న గుర్జంత్ సింగ్ ధిల్లాన్, కెనడా, యూరప్ లో ఉంటున్న లఖ్బీర్ సింగ్ రోడ్, కెనడా ఉంటున్న జతిందర్ సింగ్ గ్రేవాల్ పేర్లు ఉన్నాయి.

ఇప్పటికే పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్ లో గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇంటిని, అమృత్‌సర్ లోని అతని వ్యవసాయ భూమిని ఎన్ఐఏ జప్తు చేసింది. పంజాబ్ రాష్ట్రంలో ఇతనిపై మూడు దేశద్రోహ కేసులతో సహా 22 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇటీవల కెనడా వివాదం మొదలైన తర్వాత కెనడా హిందువులు కెనడాని వదిలి భారత్ దేశం వెళ్లాలని బెదిరించాడు.

Show comments