NTV Telugu Site icon

Aam Admi Party: గుజరాత్‌లో ఆప్‌కి మరో ఝలక్.. బీజేపీకి ఎమ్మెల్యే సపోర్ట్

Bhupat Bhayani On Aap

Bhupat Bhayani On Aap

Bhupat Bhayani Gives Shock To AAP In Gujarat: గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి వరుసగా దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. తొలుత అక్కడి ఎన్నికల్లో చక్రం తిప్పాలనుకున్న ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. 90 సీట్లు సాధిస్తామని ఆ పార్టీ ప్రకటించుకుంటే, కేవలం ఐదు స్థానాలకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. తాజాగా ఆ పార్టీకి మరో ఝలక్ తగిలింది. తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలను ఆప్ ఎమ్మెల్యే భూపత్ భయానీ ఖండించారు కానీ.. తాను బయటి నుంచి బీజేపీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతానంటూ ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పటికిప్పుడు తాను బీజేపీలోకి చేరడం లేదన్న ఆయన.. ప్రజలు కోరుకుంటే మాత్రం ఆ పార్టీలోకి చేరుతానంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు.

Software Employee Killed: సాప్ట్‌ వేర్ ఉద్యోగి దారుణ హత్య.. గొంతు, కాలి నరాలు కోసి

ఓ ఇంటర్వ్యూలో భయానీ మాట్లాడుతూ.. ‘‘ఇప్పట్లో ఆప్‌ను వీడి, బీజేపీలో చేరే ఆలోచన అయితే లేదు. ఒకవేళ ప్రజలు కోరితే మాత్రం, ఆ పార్టీలో చేరుతా. నేనిలా చెప్పడానికి ఓ కారణం ఉంది. ప్రతిపక్ష హోదాకు సరిపడా సంఖ్య ఎలాగూ లేదు. ఎమ్మెల్యేగా నేను కూడా పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. ఫలితంగా.. ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. నేను నెగ్గిన స్థానంలో రైతుల సంఖ్య ఎక్కువ. ఇరిగేషన్‌ సంబంధిత సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. వ్యాపారులు కూడా ఉన్నారు. వాళ్లందరి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉంటేనే, సమస్యల్ని పరిష్కరించగలం. లేకపోతే ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి.. పార్టీ మారే విషయంపై నేను ఓసారి ప్రజలను, స్థానిక నేతలను సంప్రదిస్తా’’ అంటూ చెప్పారు.

Waltair Veerayya: మెగాస్టార్ సినిమాలో మాస్ మహారాజా లుక్ అవుట్

ఈ విధంగా పార్టీ మారే వార్తలపై భయానీ స్పందించడంతో.. ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ట్రోల్ చేస్తున్నారు. ‘‘తన పార్టీ తరఫున గెలిచిన వాళ్లందరూ మేలిమి రత్నాలు, ఎవ్వరికీ అమ్ముడుపోరు’’ అంటూ ఆయన చేసిన స్టేట్మెంట్‌ని తెరమీదకి తెచ్చి, విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా.. భూపత్ భయానీ గతంలో బీజేపీలోనే ఉన్నాడు. కానీ, ఎన్నికల సమయంలో రెబల్‌గా మారారు. ఆప్‌లో చేరి, జునాగఢ్‌ జిల్లా విసవాదర్‌ నియోజకవర్గం నుంచి గెలిచారు. గతంలో తాను బీజేపీ ఎమ్మెల్యేగా చేసిన సేవల్ని గుర్తించి, అక్కడి ప్రజలు తనకు ఓట్లు వేసి ఉండొచ్చని భయానీ పేర్కొన్నారు.