Vande Bharat Express: భారతదేశంలో సెమీ హైస్పీడ్ రైల్ గా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇప్పటికే దేశంలో వివిధ మార్గాల్లో వందేభారత్ ట్రైన్ పరుగులు తీస్తున్నాయి. తాజాగా శనివారం రోజు భోపాల్-న్యూఢిల్లీ మధ్య మరో వందే భారత్ రైలును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. దీంతో కలిపి దేశవ్యాప్తంగా 11 వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఈ ఏప్రిల్ నెలలో మరో 4 రూట్లలో ఈ సూపర్ ఫాస్ట్ రైళ్లను ప్రభుత్వం ప్రారంభించనుంది.
Read Also: Devi Sri Prasad: మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీ పెళ్లి.. అంత చిన్న అమ్మాయితోనా..?
ఇదిలా ఉంటే శనివారం ప్రారంభించిన వందేభారత్ రైలు రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రారంభించిన తొలిరోజు గంటలకు 161 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. వందేభారత్ ఎక్స్ ప్రెస్ గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంగతో వెళ్తుందని అంచానా వేసినప్పటికీ.. దాన్ని అధిగమించి 161 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భోపాల్-న్యూఢిల్లీ మార్గంలో ఆగ్రా, మథురలోని రాజాకీ మండి మధ్య గంటకు 161 కిలోమీటర్ల వేగాన్ని తాకినట్లు తెలిపారు. ఆగ్రా కంటోన్మెంట్, నిజాముద్దీన్ స్టేషన్ల మధ్య స్పీడ్ లిమిట్ కు సరిపోయే విధంగా ట్రాకును నిర్మించారు.
భోపాల్ రాణి కమలాపతి- న్యూఢిల్లీ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగ్రా కంటోన్మెంట్-తుగ్లకాబాద్ సెక్షన్ మీదుగా గంటకు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో నడపవచ్చని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. శనివారం ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. భోపాల్-న్యూ ఢిల్లీ మధ్య 708 కిలోమీటర్లను కేవలం 7 గంటల 45 నిమిషాల్లో వందే భారత్ రైలు కవర్ చేయనుంది.