NTV Telugu Site icon

Bharat Biotech’s Nasal Vaccine: కోవిడ్ 19 నాసిల్ వ్యాక్సిన్‌కు కేంద్రం ఆమోదం

Nasal Vaccine

Nasal Vaccine

Bharat Biotech’s Nasal Vaccine Against Covid-19: కోవిడ్ 19 వ్యాధికి వ్యతిరేకంగా చేస్తున్న పోరులో మరో ముందుడుగు పడింది. ఇప్పటికే భారత్ దేశం సొంతంగా పలు వ్యాక్సిన్లు అభివృద్ధి చేసుకుంది. కోవాగ్జిన్, కోవీషీల్డ్, కార్బేవాక్స్, జై కోవ్-డీ వంటి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవే కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన స్పుత్నిక్, ఫైజర్ వ్యాక్సిన్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉంటే వ్యాక్సిన్ల విషయంలో ఇండియా మరో మైలురాయిని చేరింది. తాజాగా ముక్కు ద్వారా అందించే వ్యాక్సిన్ సిద్ధం అయింది. కరోనాకు వ్యతిరేకంగా ముక్కు ద్వారా అందించే వాక్సిన్  రూపొందించింది భారత్ బయోటెక్ సంస్థ. తాజాగా ఈ నాసిల్ వ్యాక్సిన్ కు కేంద్ర ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ వాడటానికి ఆమోదం తెలిపింది.

ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో, పెద్దవారిలో ‘ నియంత్రిత వినియోగం’ కోసం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసిల్ వ్యాక్సిన్ ను డ్రగ్ కంట్రోలర్ ఆమోదించినట్లు ఆయన వెల్లడించారు. ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తన సైన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మానవ వనరులను ఉపయోగించుకుంటుందని ఆయన ట్వీట్ చేశారు.

READ ALSO: Make Love Not War: రష్యా వరుడు.. ఉక్రెయిన్ వధువు.. భారత్‌లో పెళ్లి..!!

ప్రస్తుతం ఇండియాలో క్రమంగా కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. ఇండియాలో మంగళవారం కేవలం 4417 కొత్త కరోనా కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. మూడు నెలల కనిష్ట స్థాయికి కేసుల పడిపోయాయి. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసుల సంఖ్య 52,336కి తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 23 మంది కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయారు. మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.12గా ఉంది. కోవిడ్ రికవరీ రేటు 98.69 శాతంగా ఉంది.

Show comments